Friday, March 29, 2024

పట్టణాలు పచ్చదనంతోనే అభివృద్ధి: గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: పల్లెలు, పట్టణాలు పచ్చతోరణం ప్రగతిని సాధించాలనేదే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ అభివృద్దిలో భాగంగా ఆదివారం రోజు మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునిల్ రావు 60,41 డివిజన్లలో పర్యటించారు. మొక్కలు నాటి అభివృద్ధి పనులకు మంత్రి, మేయర్. భూమి పూజ చేశారు. సందర్భంగా గంగుల మాట్లాడారు.  పచ్చదనంతో పల్లెలు, పట్టణాలు అభివృద్ది చెందాలన్నదే  ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పమన్నారు. తెలంగాణ అభివృద్ధే ద్యేయంగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నామని, మొదటగా 60 వ డివిజన్ ముకరాంపుర జ్యోతిబా పూలే పార్కు వద్ద పద్మనాయక కళ్యాణ మండపం రోడ్డులో స్థానిక కార్పొరేటర్ వాల రమణ రావు తో కలిసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

అనంతరం నగరంలోని 41 వ డివిజన్ వావిలాలా పల్లిలో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బండారి వేణుతో కలిసి హనుమాన్ సహిత కనకదర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనతరం నగర అభివృద్ధి నేపథ్యంలో నగరపాలక సంస్థ కేటాయించిన 21 లక్షల ఎస్సి సబ్ ప్లాన్ నిధులతో సిసి రోడ్డు డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. తదననంతరం స్థానిక కార్పొరేటర్ బండారి వేణుతో కలిసి హరితహారం కార్యక్రమంలో మహిళలకు పండ్ల మొక్కలు పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడారు.

పల్లెలు పట్టణాలు అభివృద్ది చెందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టారని తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి నోచుకోలేవని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో  అభివృద్ది చెందాలని ఆకాంక్షించారని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల్లో నిధులను నేరుగా విడుదల చేశామని, అభివృద్దికి శ్రీకారం చుట్టి ప్రగతి బాటలో నడిపిస్తున్నారని తెలిపారు. నిన్నటి వరకు గ్రామాల్లో పల్లెప్రగతి పట్టణాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులు పాటు నిర్వహించామన్నారు.

ప్రజల సమస్యలు ఎన్నో గుర్తించామని, వాటికి శాశ్వత పరిష్కరం ఉంటుందని స్పష్టం చేశారు. పది రోజుల పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను నిరంతర ప్రక్రియగా అభివృద్ది పనులు చేపడుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కొనియాడుతున్నారన్నారు. ప్రజల్లో చాలా చైతన్యం వచ్చిందని… బావి తరాల భవిష్యత్ కోసం ఆలోచన చేసి పంపిణీ చేసిన మొక్కలను పెద్ద ఎత్తున నాటి సంరక్షిస్తున్నారని అన్నారు. వచ్చే తరానికి పచ్చదనం ఒక ఆస్తిగా మారుతుందని ప్రజలంతా హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించుకోవాలన్నారు.

కరీంనగర్ నగరం గతంలో కాంక్రెట్ జంగల్ గా ఉండేదని అలాంటి పరిస్థితి నుంచి హరిత కరీంనగర్ గా మార్పు చెందుతుందన్నారు. ఆ దిశగా మేమంతా కలిసి కట్టుగా కృషి చేస్తున్నామని గంగుల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టిన పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు విజయవంతమవుతున్నారు. ప్రజలు చైతన్యవంతులుగా మారి మొక్కలు నాటడం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నారన్నారు. ఇలాంటి మార్పును తెచ్చిన కెసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టణాలు పచ్చదనంతో అభివృద్ధి బాట పట్టడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ చల్ల స్వరూప రాణి, హరిశంకర్, పలువురు పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News