Friday, April 19, 2024

త్వరలో రోడ్డెక్కనున్న సిటీ ఆర్టీసి?

- Advertisement -
- Advertisement -

City buses back on roads in Hyderabad soon

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4లో భాగంగా మెట్రోకు అనుమతి ఇవ్వడం, సిటీ బస్సులను ప్రారంభించడమనేది రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసింది. అయితే మెట్రో అధికారులు నగరంలో రైళ్ళను ఈ నెల 7 నుంచి నడిపించేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నాలను ప్రారంభించారు. అయితే ఆర్టిసి అధికారులు సైతం ప్రభుత్వం నుంచి ఏ క్షణమైన అనుమతి రావచ్చని అభిప్రాయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇదే అంశంపై ఉన్నతాధికారులు పరిస్థితులపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక వైపు సమీక్షలు నిర్వహిస్తూనే సిబ్బందిని ఏ క్షణమైన విధులు నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగరంలోని 29 డిపోల్లోని సిబ్బంది బస్సులను రోడ్డు మీదకు తెచ్చేందుకు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే బస్సులకు సంబంధించిన చిన్న చిన్న మరమ్మతులను చేశామని అంతే కాకుండా బస్సుల్లో బ్యాటీరీలను డౌన్ కాకుండా రోజు సుమారు గంటసేపు ఇంజన్ ఆన్ చేసి ఉంచుతున్నారు. బ్రేక్ డౌన్ సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆర్టిసి సమ్మెకు అధికారులు 29 డిపోల ద్వారా 3550 బస్సులను ప్రతి రోజు సుమారు 42 ట్రిప్పులతో సుమారు 9 లక్షల కిలోమీటర్లు నగర నలూమూలలు తిప్పుతూ 32 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేవారు. అయితే సుమారు 70 రోజుల పాటు సిబ్బంది సమ్మెను నిర్వహించడంతో సుమారు 1500 బస్సులను పనికిరాకుండా పోయాయి. దాంతో సమ్మె అనంతరం అధికారులు 2250 బస్సులను మాత్రమే తిప్పగలిగారు. దాంతో సంస్థకు ఆదాయం కూడా అంతంతమాత్రంగానే వచ్చేది. కరోనా కారణంగా మార్చి 22 నుంచి సుమారు 6 నెలల బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని బస్సులు రోడ్డు ఎక్కుతాయనేది ప్రశ్నార్దకంగా మారింది. ఎందుకంటే 70 రోజులు సమ్మె కారణంగానే సుమారు 1500 బస్సులను పనికి రాకుండా పోయాయి. అలాంటిది ఆరు నెలలుపాటు డిపోలకే పరిమితమైన బస్సుల్లో ఎన్ని బస్సులు రోడ్డు ఎక్కుతాయో అనేది పలు అనుమానాలకు దారి తీస్తుంది.

కోవిడ్ నిబంధనలు సాధ్యమేనా…

కోవిడ్ నిబంధనల్లో భాగమైన మాస్కులు ధరించడం, సానిటైజర్లు వినియోగిచడం వంటి నిబంధనలు సిటీబస్సులో ఎంతవరకు సాధ్యమనేది అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఎందుకుంటే నగరంలో ప్రతి రెండు కిలో మీటర్ల చొప్పున ఒక బస్టాపు ఉండగా ఎక్కేవారు దిగే వారు పెద్ద సంఖ్యలో ఉంటారు. మాస్కు ఉంటనే బస్సుఎక్కాలనే నిబంధన పాటిస్తూ బస్సుల్లో ఎక్కేవారు ఎంత మంది. సిటీ బస్సులో సామాజిక దూరంగా పాటించడం ఏ మేరకు సాధ్యం అనే అంశంపై అధికారులు ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News