Thursday, April 25, 2024

నగరానికి సరిపోను నీటి నిల్వలు ఉన్నాయి

- Advertisement -
- Advertisement -

DANAKISHORE

 

హైదరాబాద్ : మంచినీటి సరఫరాకు సంబంధించి ఎవరూ భయాపడాల్సిన అవసరం లేదని నగరానికి సరిపడా మంచినీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని జలమండలి ఎండి ఎం.దానకిశోర్ తెలిపారు. కోవిడ్ 19తీవ్రత దృష్యా మంచినీటి సరఫరా, సివరేజ్ పనులకు సంబంధించి దాన కిశోర్ మంగళవారం ఒఅండ్ ఎం సిజిఎంలు, జిఎంలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు సరిపోను మంచినీటి నిల్వలు ఉన్నాయని సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పని చేసే ఉద్యోగులు, లైన్‌మైన్లు, సివవరేజ్ సిబ్బంది, ఎయిర్ టెక్‌మిషన్ సిబ్బంది, ట్యాంకర్ల సిబ్బందికి ఇబ్బందులు కల్గకుండా వ్యక్తిగతపాసులతో పాటు వాహన పాసులను అందజేయాలని అధికారులకు సూచించారు. –అవసరమైతే పోలీసు విభాగం సమన్వయంతో విధులు నిర్వహించాల్సిందిగా సూచించారు.

అదేవిధంగా కరోనా ప్రబలే అవకాశం ఉన్నందున మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మాస్కులు, గ్లౌజులు వంటి భద్రత పరికరాల కోసం ప్రతి అధికారికి రూ.5 వేలు చొప్పున ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా శానిటైజర్లను జలమండలి ల్యాబ్‌లో తయారు చేసి పంపినీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు సిజిఎంలు, జిఎం కిందిస్థాయి సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచించారు. ప్రతి శనివారం సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు మంచినీటి సరఫరా, సివరేజ్ సమస్యల ఫిర్యాదులకు డయల్ యువర్ ఎండి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో జలమండలి ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్.సత్యనారాయణ, డైరెక్టర్లు శ్రీధర్ బాబు, వాసుదేవ నాయుడు, పి.రవి, టెక్నికల్ డైరెక్టర్ వి.ఎల్.ప్రవీణ్ కుమార్‌లు పాల్గొన్నారు.

City has Sufficient Water Reserves
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News