Home జాతీయ వార్తలు సివిల్స్ -2019 ఫలితాలు వెల్లడి

సివిల్స్ -2019 ఫలితాలు వెల్లడి

Civil Services Examination-2019 Result Releasedఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ఫలితాలను యుపిఎస్ సి మంగళవారం వెల్లడించింది. 2019 సెప్టెంబర్ లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. 2020 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఆగ‌స్టు వ‌ర‌కు అభ్యర్థులకు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించారు. సివిల్స్ కు మొత్తం 829 మంది ఎంపికయ్యారు. సివిల్ స‌ర్వీసుల‌కు ఎంపికైన వారిలో 304 మంది జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు ఉండగా, 78 మంది ఈడ‌బ్ల్యూఎస్‌, 251 మంది ఒబిసి, 129 మంది ఎస్ సి, 67 మంది ఎస్ టి కేట‌గిరీల‌కు చెందినవారు ఉన్న‌ట్లు యుపిఎస్ సి అధికారులు తెలిపారు. సివిల్స్ లో నెగ్గిన వారి జాబి‌తాను విడుద‌ల చేశారు. ప్ర‌దీప్‌సింగ్ అనే అభ్యర్థి మొద‌టి ర్యాంక్ సాధించాడు. జ‌తిన్ కిషోర్ అనే అభ్యర్థి 2వ ర్యాంక్‌, ప్ర‌తిభా వ‌ర్మ 3వ ర్యాంకు సాధించారు. త‌మ వెబ్‌సైట్ లో ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చ‌ని యుపిఎస్ సి తెలిపింది.