Home జిల్లాలు అక్టోబర్ 2 నుంచి… పౌర సేవలు

అక్టోబర్ 2 నుంచి… పౌర సేవలు

మొదటి విడుతలో 75 గ్రామాల్లో జిల్లాలో 568 క్లస్టర్‌ల ఏర్పాట్లు
వ్యక్తిగత ధృవీకరణ పత్రాలు గ్రామ పంచాయతీల్లోనే

1258నల్లగొండ : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మాగాంధీ పుట్టిన రోజైన అక్టోబర్ 2 నుంచి గ్రామ పంచాయతీల్లో పౌర సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో, రాష్ట్రంలో కొత్తపుంతలు తొక్కుతున్న అంతర్జాల వ్యవస్థను అనుసరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం క్రమంగా కంప్యూటర్ సేవలను వినియోగించి రానున్న రోజుల్లో ఇంటింటికి ఇంటర్‌నెట్ సేవలు అందించనుంది. అందులో భాగంగానే గ్రామ పంచాయితీల్లో ఈ పంచాయతీ వ్యవస్థను తీసుకొస్తుంది. జిల్లాలోని 1176 గ్రామ పంచాయతీలు ఉండగా 568 క్లస్టర్‌లుగా విభజించారు. 5 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలను ఒక క్లస్టర్, అంతకంటే తక్కువగా ఉంటే క్లస్టర్‌లో రెండు లేదా మూడు గ్రామ పంచాయతీలను కలుపనున్నట్లు తెలిసింది. ఇప్పటికే అనేక పంచాయతీలకు కంప్యూటర్‌లు సరఫరా చేసినట్లు సమాచారం. వంద మందికి పైగా కంప్యూటర్ ఆపరే టర్లను నియమించారు. కార్వే, కన్సల్టెన్సీ అనే సాప్ట్‌వేర్ సంస్థ ద్వారా ఆపరేటర్లను ఎంపిక చేసినట్లు తెలిసింది. జిల్లాలో 568 క్ల్లస్టర్‌లు ఉండగా మొదటి విడతగా 75 క్లస్టర్‌లలో ఈ గవర్నెన్స్ సేవలు అందించడానికి అధికారులు సమాయత్తం అయ్యారు.

గ్రామాలకు ఎంపికైన కార్వే కన్సల్టెన్సీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను వచ్చేనెల మొదటి వారంలో శిక్షణకు పంపనున్నారు. అయితే ప్రభుత్వం ఆయా గ్రామాల్లో విలేజ్‌లెవల్ ఎంట్రీ ప్రేన్యూర్ (విఎల్‌ఈ) పేరుతో డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు ఉద్యోగ అవ కాశం కల్పించి ఈ సేవలు వారి నుంచి పొందాలని భావిస్తు న్నారు. మొదటగా జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఈ పం చాయతీ వ్యవస్థలో భాగంగా గ్రామ పంచాయితీ కార్యా లయాల నుండి ప్రజలకు అందించనున్నారు. ఆనంతరం గ్రామ పంచాయితీలోని నల్లా బిల్లులు, ఇంటి పన్నులు, ఉపాధిహామీ పనులు చేసే కూలీల చెల్లింపులు, ఆసరా పింఛన్లు, ఇతర సేవ లు ఈ పంచాయతీ ద్వారానే అందించేందుకు ప్రభుత్వం సమా యత్తం అవుతుంది. జిల్లాలో మొదటగా ఈ మోడల్ పంచా యతీగా చౌటుప్పల్ గ్రామ పంచాయితీని ఎంపిక చేశారు. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో పంచాయతీ అధికారుల పరిధిలో ఉండ టంతో పంచాయతీ కార్యదర్శులు చేసేటటువంటి సేవలను ఈ పద్దతి ద్వారా పరిష్కరిస్తారు. ఈ వ్యవస్థ గనుక ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడితే సొంత గ్రామంలోనే ప్రజలకు సమస్యలు పరిష్కారం కానున్నాయి.

ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ది దిశగా నడిపించేందుకు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. 14వ ఆర్థిక సం ఘం నిధులను కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని 1176 గ్రామ పంచాయతీలకు గాను తొలి విడుతగా రూ.37.19 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్ విడుదల చేయనున్నారు. గ్రామ పంచాయితీల అభివృద్దే లక్షంగా మండల, జిల్లా పరిషత్‌లకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు పది లక్షలు తగ్గకుండా అందిస్తుందని సర్పంచ్‌లు ఆశతో ఎదురుచూస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీలకు విడు దలైన నిధులను సర్పంచ్‌లు దుర్వినియోగం చేశారని ఆరోప ణలు ఉన్న నేపద్యంలో ఈ సారి సర్పంచ్‌తో పాటు పంచాయితీ కార్యదర్శి, ఈఓపిఆర్‌డి లేదా ఎంపిడిఓకు జాయింట్ చెక్ పవర్‌తో ఈ నిధులను ఖర్చు చేయాలని లింకు పెట్టినట్లు తెలు స్తుంది. 14వ ఆర్థిక సంఘం నిధులను సిసి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, లింక్‌రోడ్లు, ఇతర అవసరాలకు వినియోగించ ను న్నారు. ఏది ఏమైనప్పటికీ అక్టోబర్ 2వ తేది నుండి గ్రామ పం చాయతీల్లోనే ప్రజలకు అన్ని రకాల సేవలు అందించాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది.