Wednesday, April 24, 2024

సివిల్స్ ప్రిలిమ్స్ అక్టోబర్ 4నే

- Advertisement -
- Advertisement -

Civils Preliminary Examinations will be held on October 4

 

వాయిదాకు సుప్రీం నో
కరోనా నేపథ్యంలో సరైన
ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు

న్యూఢిల్లీ : యుపిఎస్‌సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు అనుకున్న ప్రకారం అక్టోబర్ 4వ తేదీనే జరుగుతాయి. వీటిని ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయాలనే పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. అయితే కోవిడ్ కారణంగా పరీక్షలకు చివరి అర్హత ఉన్న వారికి రాయితీలు కల్పించే విషయాన్ని అధికారులు అభ్యర్థనల మేరకు పరిశీలించవచ్చు. ఈ మేరకు న్యాయమూర్తి ఎఎం ఖాన్విల్కర్ సారధ్యపు ధర్మాసనం సుప్రీంకోర్టు తమ తీర్పులో స్పష్టం చేసింది. ప్రిలిమ్స్‌కు హాజరయ్యేందుకు చివరి అవకాశం ఉన్న వారు కరోనా వైరస్ నేపథ్యంలో రాలేకపోతే ఇతరత్రా అవకాశాలు కల్పించవచ్చా? లేదా అనేది సంబంధిత అధికారులు పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఇక అధికారులు అడ్మిట్ కార్డులతో ఉన్న అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు లేదా ఉప కేంద్రాల వద్ద హోటల్స్‌లో కానీ ఇతరత్రా కానీ సముచిత నివాసం కల్పించాల్సి ఉంటుందని రూలింగ్‌లో తెలిపారు. అభ్యర్థుల భద్రత, ఆరోగ్యపరమైన ప్రోటోకాల్స్ ఖచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని ధర్మాసనం ఆదేశించింది.

పరీక్షలను ఏ కారణం చేతనైనా ఇంకా ఆలస్యం చేయడం వల్ల భవిష్యత్తులో పలు విధాలుగా ప్రభావం పడుతుందని న్యాయస్థానం పేర్కొంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ ప్రకారమే యుపిఎస్‌సి ప్రిలిమ్స్ నిర్వహించాలని ఆదేశించింది. వాయిదాకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 72 సెంటర్లు ( 2569 సబ్‌సెంటర్లు)లో పరీక్షలు జరుగుతాయి. ఈ సందర్భంగా ధర్మాసనం కేబినెట్ సెక్రెటరీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖను ప్రస్తావిస్తూ దాఖలు అయిన అఫిడవిట్‌ను బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. పరీక్షల నిర్వాహకులు, పరీక్షలు రాసే వారికి ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా చూడాలని ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉందని ఈ లేఖలో తెలిపారు. సుప్రీంకోర్టుకు ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా యుపిఎస్‌సి తరఫున న్యాయవాది నరేష్ కౌశిక్ ప్రాతినిధ్యం వహించారు.

అత్యంత కీలకమైన ఏర్పాట్లు చేయడం పూర్తి అయిందని వివరించారు. అక్టోబర్ 3, 4 తేదీలలో ప్రజా రవాణా వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాల్సి ఉందని రాష్ట్రాల ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా తెలియచేసినట్లు కూడా తెలిపారు. అంతేకాకుండా అన్ని ప్రాంతాలలో రైళ్ల నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలని కూడా రైల్వే బోర్డు ఛైర్మన్, ప్రధాన కార్యనిర్వాహక అధికారికి లేఖలు రాశారు. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షల కోసం 10.58 లక్షల మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ మేరకు పరీక్షలు రాసేందుకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. భౌతికదూరాలు ఇతరత్రా కోవిడ్ నిబంధనలు నిర్థిష్టంగా పాటించాల్సి ఉంటుంది. యుపిఎస్‌సి ప్రిలిమ్స్ ఏర్పాట్ల కోసం పబ్లిక్ సర్వీసు కమిషన్ రూ 50.39 కోట్లు ఖర్చు పెట్టింది.

సెప్టెంబర్ 28 నాటికి 28,687,648 మంది అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారు. నిజానికి ఈ పరీక్షలు మే 31వ తేదీన జరగాల్సి ఉంది. అప్పట్లో కరోనా తీవ్రత, అంతకు మించి లాక్‌డౌన్, పలు ఆంక్షలు ఉండటంతో వీటిని అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేశారు. కేంద్ర సివిల్ సర్వీసెస్‌లలో ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవల్సి ఉంది. సరైన ప్రతిభాయుత అభ్యర్థుల ఎంపిక లేకుండా ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు అభ్యర్థుల నియామకం జరగదు. సరైన సమయంలో సరైన వ్యక్తులను ఎంపిక చేసి నియామకాలు చేపట్టడం కీలకం , పైగా రిక్రూట్‌మెంట్లు, శిక్షణా ప్రక్రియ, పూర్తి స్థాయిలో నియామకాలకు సమయం పడుతుంది. ఇదో సమగ్ర వలయంగా ఉంటుంది. దీనిని చెదిరిపోకుండా చేయాల్సి ఉంది. జాప్యం లేదా వాయిదాల ప్రక్రియ కుదరదనే విషయాన్ని అన్ని స్థాయిల పరిణామాలను దృష్టిలో తీసుకుని గమనించి ఈ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణకు వీలు కల్పిస్తూ తీర్పును వెలువరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News