Home జాతీయ వార్తలు పన్నుపోటు సామాజిక అన్యాయమే

పన్నుపోటు సామాజిక అన్యాయమే

SA Bobde

 

భారత ప్రధాన న్యాయమూర్తి

న్యూఢిల్లీ : పౌరులపై విపరీత పన్నుపోటు ప్ర భుత్వ సామాజిక అ న్యాయమే అని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డే తెలిపారు. పన్ను ఎగవేతలు తోటి పౌరుల పట్ల సామాజిక అన్యాయమే అవుతుందని, ఇదే విధంగా ఏకపక్ష, అత్యధిక పన్నులు విధిస్తే అది ప్రభుత్వం సమాజానికి చేసే అన్యాయం అవుతుందన్నారు. ఈ రెండూ వాంఛనీయం కాదన్నారు. ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ 79వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. పన్నుల వసూళ్ల గురించి మాట్లాడుతూ పుష్పాలకు హాని కలుగకుండా తెనెతెట్టెల నుంచి తేనెను సేకరించే విధంగా జాగ్రత్తగా పన్నులను వసూలు చేయాల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వానికి తమ బకాయిలు ఏమిటీ? ప్రభుత్వం నుంచి తమకు రావల్సిందేమిటీ? అనేది జనబాహుళ్యానికి తెలియాల్సి ఉందన్నారు. ఐటి వ్యాజ్యాల సక్రమ పరిష్కార ప్రక్రియతోనే వసూళ్ల ప్రక్రియ సాధ్యమవుతుందన్నారు. పన్నుల వ్యాజ్యాల సత్వర పరిష్కారం ఓ విధంగా పన్ను చెల్లింపుదార్లకు రాయితీనే అవుతుందన్నారు. సరైన పన్ను మదింపుల ప్రక్రియ సమర్థవంతమైన పన్ను న్యాయవ్యవస్థల సమర్థతను చాటుతాయని తెలిపారు. పన్నుల ఎగవేత కేసులు ఏళ్ల కొద్దీ పెండింగ్‌లో ఉండటం పట్ల న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. పన్నుల చట్రం సరిగ్గా పనిచేస్తేనే వనరుల సమీకరణ తేలిక అవుతుందని అన్నారు.

CJI calls for speedy resolution of tax disputes