Thursday, November 30, 2023

వరంగల్‌ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు..

- Advertisement -
- Advertisement -

వరంగల్‌: సిజేఐ ఎన్వీ రమణ వరంగల్‌ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం తన సతీమణితో కలిసి ఆలయానికి చేరుకున్న సిజేఐ ఎన్వీ రమణకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ దంపతులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారిని అమ్మవారి దీవెనలతోపాటు తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, ఎన్వీ రమణ దంపతులు నిన్న సాయంత్రం రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించారు.

CJI NV Ramana visit Warangal Bhadrakali Temple

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News