Home జాతీయ వార్తలు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సిజెఐ రమణ

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సిజెఐ రమణ

CJI Ramana Visits Srisailam Mallanna Templeకర్నూలు : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) ఎన్ వి రమణ దంపతులు శుక్రవారం శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. రమణ దంపతులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన రమణ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లన్న దర్శన అనంతరం రమణ దంపతులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అంతకుముందు రమణ దంపతులకు నందికేతన అతిథి గృహంలో ఎపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘనస్వాగతం పలికారు. రమణ దంపతుల వెంట  నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, కలెక్టర్ జి వీరపాండియన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, డీఐజీ వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ కృపా సాగర్, ఎస్పీ డాక్టర్ కె. పక్కిరప్ప, ఏపీ హైకోర్టు రిజిస్టర్ న్యాయమూర్తి జస్టిస్ డి వెంకటరమణ, తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి, జస్టిస్ డి. నాగార్జున, జిల్లా జడ్జి ఫ్యామిలీ కోర్టు వి. శ్రీనివాస్, దేవస్థాన ఈఓ కేఎస్‌ రామరావు తదితరులు ఉన్నారు.