Friday, March 29, 2024

హైకోర్టు జడ్జీలుగా ‘సుప్రీం’ లాయర్లు

- Advertisement -
- Advertisement -

CJI requests CJs to consider elevating SC lawyers as HC judges

హైకోర్టు సిజెలకు సిజెఐ రమణ వినతి

న్యూఢిలీ: సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న సీనియర్ న్యాయవాదులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించే విషయాన్ని పరిశీలించాలని దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎన్‌వి రమణ కోరారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులను హైకోర్టులలో న్యాయమూర్తులుగా నియమించే విషయాన్ని పరిశీలించాలని కోరుతూ తాను ఇటీవల సిజెఐకి రాసిన లేఖను పురస్కరించుకుని సిజెఐ ఈ మేరకు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్‌సిబిఎ) అధ్యక్షుడు వికాస్ సింగ్ మంగళవారం తెలిపారు.

సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న అర్హులైన, ప్రతిభావంతులైన న్యాయవాదులను గుర్తించి వారికి హైకోర్టులలో న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించే ప్రక్రియ కోసం ఎస్‌సిబిఎ కార్యవర్గం ఒక సెర్చ్ కమిటీని నియమించిందని ఆయన తెలిపారు. ఈ కమిటీ ఎస్‌సిబిఎ ఉపాధ్యుక్షురాలు మహాలక్ష్మి పావని, మరో నలుగురు సభ్యులు రాకేష్ ద్వివేది, శేఖర్ నఫడే, విజయ్ హన్సారియా, వి గిరి ఉన్నారని ఆయన చెప్పారు. ఇదే విధంగా హైకోర్టు బార్ అసోసియేషన్ల సభ్యులతో పాటు ఎస్‌సిబిఎ సిఫార్సు చేసిన పేర్లను కూడా హైకోర్టు కొలీజియమ్ పరిశీలించి వారిలో అర్హులైన న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించవచ్చని ఆయన సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News