Home ఖమ్మం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్-టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్-టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..

TRS

ఖమ్మం: జిల్లాలో శనివారం నాడు టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య  ఘర్షణ జరిగింది. గత కొద్ది రోజుల క్రితం గిరిజన  ఎంఎల్ఎ హరిప్రియ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. తాజాగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఎంఎల్ఎ హరిప్రియ ప్రచారానికి జిల్లాలోని కామేపల్లి మండలంలో గోవింద్రాల గ్రామానికి వెళ్లారు. అయితే హరిప్రియ టిఆర్ఎస్ లో చేరడంపై కోపంగా ఉన్న గ్రామ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆమెను అడ్డుకొని వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య  ఘర్షణగా చోటు చేసుకోవడంతో కార్యకర్తలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణ లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఎంఎల్ఎ హరిప్రియను పోలీసులు ఘటన ప్థలం నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం గోవింద్రాల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు.

Clash between Congress and TRS activists in Khammam