Saturday, April 20, 2024

భట్టి పాదయాత్రలో ఘర్షణ..

- Advertisement -
- Advertisement -

జనగామ: భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా పొన్నాల, కొమ్మూరి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. భట్టికి స్వాగతం పలుకుతున్న క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం నినాదాలు చేయడంతో అది కాస్త తోపులాటకు దారితీసింది. శుక్రవారం తరిగొప్పుల మండలం అబ్దుల్‌నాగారం వద్దకు భట్టి పాదయాత్ర చేరుకోగానే పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వేర్వేరుగా స్వాగతం పలికారు. ఈ సమయంలో తమ నేతలకు అనుకూలంగా రెండు వర్గాలు నినాదాలతో చేసే క్రమంలో తోపులాట జరిగింది. నర్మెట సిఐ నాగబాబు, తరిగొప్పుల ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సమయంలో భట్టి విక్రమార్క చాలా ఇబ్బందికి గురవటంతోపాటు అసహనానికి లోనయ్యారు. రెండు వర్గాల మధ్య భట్టి కొంతసేపు ఇరుక్కుపోయారు.

పోలీసులు ఆయనను బయటకు తీసుకొచ్చి ముందుకు పంపించడంతో పాదయాత్ర సాగింది. అనంతరం లంచ్ సమయంలో పొన్నాల ఏర్పాటు చేసిన కా్ంయపు వద్ద భట్టి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి కొమ్మూరి వర్గం రావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ క్యాంపు వద్దకు ఎందుకు వచ్చారంటూ పొన్నాల వర్గం కొమ్మూరి వర్గంతో వాగ్వాదానికి దిగారు. మళ్లీ పోలీసులు రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. కాగా పొన్నాల లక్ష్మయ్య వర్గం మనుషులు మద్యం సేవించి వచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించారని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. తనను, తన కార్యకర్తలను పొన్నాల వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు.

భట్టి పాదయాత్రలో ఎలాంటి గొడవలు జరగొద్దనే ఉద్దేశంతోనే తాను పక్కకు తప్పుకున్నానని తెలిపారు. పాదయాత్ర విజయవంతం కావాలన్నదే తన ఉద్దేశమన్నారు. దీనిపై పొన్నాల స్పందిస్తూ కొంతమంది పనికిమాలిన వ్యక్తులు పనిగట్టుకొని పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. భట్టి పాదయాత్రను అడ్డుకోవడం సరైందికాదని అన్నారు. తన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News