Home అంతర్జాతీయ వార్తలు సెంట్రల్ నైజీరియాలో ఘర్షణ : 86 మంది మృతి

సెంట్రల్ నైజీరియాలో ఘర్షణ : 86 మంది మృతి

Clashes in Central Nigeria : 86 People killed

నైజీరియా : సెంట్రల్ నైజీరియాలో జరిగిన ఘర్షణలో 86 మంది చనిపోయారు. రైతులు, పశువుల వ్యాపారులకు మధ్య ఈ ఘర్షణ జరిగింది. స్థానిక జాతులైన బెరోమ్ రైతులు, ఫౌలానీ పశువుల వ్యాపారుల మధ్య గురువారం భారీ ఘర్షణ జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘర్షణలో ఐదుగురు చనిపోయారు. మళ్లీ శనివారం జరిగిన ఘర్షణల్లో 81 మంది చనిపోయారు. భూమి కోసం ఈ ప్రాంతంలో దశాబ్ధాలుగా స్థానిక తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణలో 50 ఇళ్లు, 15 బైక్‌లను, రెండు కార్లను కూడా ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కర్ఫూ విధించినట్టు పోలీసు కమిషనర్ ఉండి అడే తెలిపారు.

Clashes in Central Nigeria : 86 People killed