Home జాతీయ వార్తలు పశ్చిమ బెంగాల్ లో ఘర్షణలు

పశ్చిమ బెంగాల్ లో ఘర్షణలు

Clashesకోల్‌కతా:  సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్  సందర్భంగా బెంగాల్‌లో పలు చోట్ల ఆదివారం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బిజెపి అభ్యర్థులు, సానుభూతిపరులను టిఎంసి కార్యకర్తలు అడ్డుకుని దాడులు చేశారు. ఉత్తర కోల్‌కతాలో బిజెపి అభ్యర్థిపై  కూడా దాడి చేశారు.  బషీర్‌హాట్ నియోజకవర్గంలో బిజెపి కార్యకర్తలపై టిఎంసి కార్యకర్తలు దాడులు చేశారు. ఇదిలాఉండగా. కేదార్ నాథ్ లో ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడడంపై టిఎంసి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ మోడీ మీడియాతో మాట్లాడడం ఎన్నికల ఉల్లంఘన కిందికే వస్తుందని వారు పేర్కొన్నారు. మోడీ వ్యవహారంపై టిఎంసి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా  ఆదివారం దేశంలోని 8 రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అయితే ఉదయం పది గంటల వరకు దేశ వ్యాప్తంగా  11.75 శాతం ఓటింగ్ నమోదైంది.  జర్ఖండ్‌లో అత్యధికంగా 15 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. చివరి విడత ఎన్నికల్లో 918 మంది పోటీ పడుతున్నారు. పది కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Clashes in West Bengal On Sunday