Home రాష్ట్ర వార్తలు మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు

మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు

Students-Exams

హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. టెన్త్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 15 నుంచి 31 వరకు జరుగనున్నాయి.  ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.  ఇది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులతో పాటు ఫెయిలైన అభ్యర్థులు కూడా వర్తిస్తుంది. ఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ మేర కు సెకండరీ విద్య సంచాలకులు బి.సుధాకర్ గురువారం షెడ్యూల్ విడుదల చేశారు.