Friday, April 19, 2024

బడిగంట-2

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో నేటి నుంచి 6,7,8 తరగతులకు పాఠశాలలు ప్రారంభం
మార్చి 1వరకు ఎప్పుడైనా తెరవవచ్చు
తలిదండ్రుల అనుమతి తప్పనిసరి
కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి-విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం నుంచి 6, 7,8 తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా త రగతులను ప్రారంభించాలనే నిర్ణయా న్ని తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. స్థానిక ఏర్పాట్లను బట్టి 6,7,8 తరగతులను బుధవారం నుండి మార్చి 1వ తేదీ వరకు ప్రారంభించుకోవచ్చని మం త్రి సూచించారు. 6,7,8 తరగతుల ప్రారంభంపై బుధవారం విద్యా శాఖ అధికారులతో తన కార్యాలయంలో స మీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, సత్యనారాయణరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే విద్యార్థులను తరగతుల కు అనుమతించాలని స్పష్టం చేశారు. పాఠశాలకు హాజరు కావాలని విద్యార్థులను ఒత్తిడి చేయకూడదని ఆయా యా జమాన్యాలకు మంత్రి ఆదేశించారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లోనూ ప్రత్యేకంగా శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్ధులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని భౌతి క దూరం పాటించాలని మంత్రి కోరా రు, 6,7,8 తరగతులకు ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో పాఠాలను బోధిస్తున్నారని, ఇకపై ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతుల బోధన కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల 17.10 లక్షల మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ విద్యా శాఖ పరిధిలోని 8,891 పాఠశాలల్లో 8,88, 742 మంది, 10,275 ప్రైవేట్ పాఠశాలల్లోని 8,28,516 మంది విద్యార్థులు, వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న 1,157 గురుకుల విద్యా సంస్థల్లో 1,98,853 మంది విద్యార్థులు 6,7,8 తరగతులు చదువుతున్నారని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖాధికారులను ఆదేశించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటించడంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు కూర్చునేందుకు తరగతి గదులు తక్కువగా ఉంటే షిప్ పద్దతిలో పాఠశాలను నడుపుకునేందుకు అనుమతిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కలెక్టర్‌తో సిఎస్ టెలీ కాన్ఫరెన్స్
రాష్ట్రంలో 6,7,8 తరగతులకు బుధవారం ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, డిఇఒలు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటి శాఖలకు సంబంధించిన జిల్లా సంక్షేమ అధికారులతో మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 6,7, 8 తరగతులకు వీలైన మేరకు బుధవారం నుంచి లేదా మార్చి 1లోగా ప్రారంభించాలని తరగతులు ప్రారంభించాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. 6 నుండి 8వ తరగతులకు సంబంధించి 17.24 లక్షల మంది విద్యార్ధులతో పాటు ఇప్పటికే హాజరవుతున్న విద్యార్ధులు కూడా ఉంటారని తెలిపారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిటీలు సమావేశమై 6 నుండి 8వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల భద్రత కోసం ఉపాధ్యాయులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలలను మొదటిసారి ప్రారంభిస్తున్నందున ప్రత్యేక చర్య లు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో వైద్య ఆ రోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.యం రిజ్వీ, ఎస్‌సి సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, బిసి సంక్షేమ కార్యదర్శి బి.వెంకటేశం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి నదీమ్ అహ్మద్, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.
ప్రైమరీకి నో క్లాసెస్..?
ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఈసారి ప్రత్యక్ష బోధన వద్దని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ప్రీప్రైమరీతో పాటు ఒకటి నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరానికి ప్రారంభించాలా..? వద్దా..? అన్న అంశంపై విద్యాశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. విద్యార్థుల వయసు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రీప్రైమరీ, ప్రైమరీ తరగతుల విద్యార్థులకు భౌతిక తరగతుల నిర్వహణ వద్దని విద్యాశాఖ అంతర్గతంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. త్వరలో ప్రాథమిక తరగతులపై అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. కొవిడ్ కారణంగా ఈసారి విద్యాసంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలల్లో 9, 10 తరగతులు, ఇంటర్, డిగ్రీ, పిజి విద్యార్థులను భౌతిక దూరం పాటిస్తూ స్కూళ్లు, కాలేజీల్లో భౌతిక తరగతులు నిర్వహిస్తుండగా, రాష్ట్రంలో బుధవారం నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

Classes 6 to 8 will start from tomorrow in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News