Tuesday, April 16, 2024

మూడు గ్రూపులుగా కొవిడ్ రోగుల వర్గీకరణ

- Advertisement -
- Advertisement -

Classification of Covid patients into three groups

 

మిన్నెసొటా వర్శిటీ పరిశోధకుల అధ్యయనం

వాషింగ్టన్ : కొవిడ్ రోగుల్లో ఇతర వ్యాధి లక్షణాలు, సమస్యలు, ఆస్పత్రి చికిత్సా ఫలితాల ఆధారంగా కొవిడ్ 19 రోగులను మూడు గ్రూపులుగా శాస్త్రవేత్తలు వర్గీకరిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ రిస్కు ఎదుర్కొనే వ్యక్తుల చికిత్సకు సంబంధించి భవిష్యత్ ఆవిష్కరణలకు వీలు కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అధ్యయనం జర్నల్ పిఎల్‌ఒఎస్ వన్‌లో వెలువడింది. అమెరికా లోని మిడ్‌వెస్టర్న్‌కు చెందిన 14 ఆస్పత్రుల నుంచి ఎలెక్ట్రానిక్ హెల్త్ రికార్డులను విశ్లేషించడంతోపాటు మిన్నిసొటా లోని 60 ప్రైమరీ కేర్ క్లినిక్‌ల నుంచి అధ్యయనం సాగించారు. 2020 మార్చి 7 నుంచి ఆగస్టు 25వరకు కరోనా నిర్థారణ అయిన 7538 మంది రోగులను అధ్యయనం లోకి తీసుకున్నారు. వీరిలో 1022 మంది ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవలసి న అవసరం ఉందని గుర్తించారు. అమెరికా లోని మిన్నెసొటా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేపట్టారు. 60 శాతం మంది రోగులను చాలా సన్నిహితంగా అధ్యయనం చేసి వీరిని ఫెనోటైప్ 2 గా వర్గీకరించారు. 23 శాతం మంది రోగులు ఫెనోటైప్ 1 గా గుర్తించారు.

వీరి చికిత్సఫలితాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని వివరించారు. ఈ రోగులకు ఎక్కువ స్థాయిలో గుండె, మూత్రపిండాల వైఫల్యం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. 173 మంది రోగులు లేదా 16.9 శాతం మంది ఫెనోటైప్ 3 గ్రూపులో ఉన్నారని చెప్పారు. వీరు చికిత్స ఫలితాలు బాగున్నాయని వివరించారు. ఈ గ్రూపు రోగుల్లో సమస్యలు తక్కువని, మరణించే ప్రమాదం అంతగా లేదని పేర్కొన్నారు. మిగతా ఫెనోటైప్ గ్రూపులతో పోలిస్తే వీరికి శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఎక్కువగా ఉన్నా ఆస్పత్రిలో మళ్లీ చేరే రిస్కు పది శాతం మాత్రమే ఉందని వివరించారు. ఫెనోటైప్ 3 గ్రూపుతో పోల్చుకుంటే ఫెనోటైప్ 1,2 గ్రూపులకు మృత్యుప్రమాదం ఎక్కువని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఫలితాల ఆధారంగా ఫెనోటైప్‌కు తగిన వైద్య చికిత్స అందించడానికి కొవిడ్ 19 చికిత్స మెరుగుపర్చడానికి వీలవుతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News