Thursday, April 25, 2024

నిరంతరం పరిశుభ్రతను పాటించండి

- Advertisement -
- Advertisement -

కరోనాను ఖతం చేద్దాం..
ఆరోగ్యంగా జీవిద్దాం
జనతా కర్ఫూ తరహాలో
లాక్‌డౌన్‌ను విజయవంతం చేద్దాం
కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి
కరోనా నివారణలో మనమే ముందువరుసలో నిలుద్దాం
ఎలాంటి నిర్లక్షం వహించిన వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది
చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి
వీడియో ద్వారా
కరోనాపై సందేశాన్ని
అందించిన మంత్రి హరీశ్‌రావు

 Corona virus

 

మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : కరోనా వై రస్‌ను ఖతం చేసి ఆరోగ్యంగా జీవిద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కరోనాపై ప్రజలకు వీడియో ద్వారా సందేశాన్ని అందించా రు. జనతా కర్ఫూని విజయవంతం చేసిన తరహాలోనే సిఎం కెసిఆర్ పిలుపునిచ్చిన లాక్‌డౌన్‌ను సై తం విజయవంతం చేద్దామన్నారు. ప్రతి ఒక్కరూ ఇండ్లలోనే ఉంటూ కరోనా మహమ్మారిని దరిచేరకుండా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అవసరానికి తప్ప అనవసరాలకు రోడ్లపై కి రావద్దని సూచించారు. చైనా, ఇటలీ లాంటి దే శాలు నిర్లక్షం వహించడంతోనే వేలాది మంది ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ వైరస్ 150 దేశాలకు వ్యాపించడంతో సుమారు 10వేల మంది మరణి ంచారని పేర్కొన్నారు. ఈ భయంకరమైన వైరస్ మన రాష్ట్రంలో ప్రవేశించడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిశుభ్రతను పాటించాలన్నారు. సి ద్దిపేట పౌరులుగా మనం అన్నింటా ముందున్నామని, కరోనా నివారణలో సైతం మనమే ముందు వరుసలో నిలుద్దామన్నారు. విదేశాల నుండి వచ్చే వారి వివరాలను వెంటనే ప్రభుత్వాధికారులకు తె లియజేయాలన్నారు. జ్వరం, దగ్గు, తల, గొంతునొప్పి లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. తుమ్మిన, దగ్గిన చేతి గుడ్డ అడ్డం పెట్టుకోవాలన్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వడం మానుకోవడంతో పాటు ఒక వ్యక్తికి మరో వ్యక్తి దూరంగా ఉండాలన్నారు. ఒకరి నుండి మరొకరి కి వేగంగా వ్యాపించే ఈ కరోనాను ఆరికట్టడమే లక్షంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీ సుకుంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సూచన లు పాటించాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం ఇ చ్చిన సలహాలు, సూచనలను పాటించకుండా రో డ్లపై తిరిగితే జరిమానాతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పో లీసులకు సహకరించి విజ్ఞతతో ప్రవర్తించాలన్నా రు. దూర ప్రయాణాలు చేయడం మానుకోవడం తో పాటు ప్రతిఒక్కరూ కుటుంబ సభ్యులతో ఇం డ్లలోనే ఉంటూ సంతోషంగా జీవించాలని దండం పెడుతూ వేడుకుంటున్నానన్నారు.

Clean in every area with Corona virus in Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News