Wednesday, March 22, 2023

ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పరిశుభ్రత ప్రధానం

- Advertisement -

officers
*ఆర్డిఓ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రామ్మోహన్‌రావు

మనతెలంగాణ/ నిజామాబాద్ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పరిశుభ్రంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు అధికారులను, సిబ్బంది ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆర్డిఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రతి సెక్షన్ రూం, కంప్యూటర్ గదులను, డిఎడి, డిటి రూంలను పరిశీలించారు. రికార్డు రూంను పరిశీలించారు. రికార్డు రూంలో ఏ సంవత్సరం నుండి రికార్డులను పొందుపర్చారని ఉన్న రికార్డులను సంవత్సరం వారిగా క్రమ పద్దతిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యాలయాల్లోని ఆవరణలో శుభ్రత పాటించాలని, ఇది సిబ్బంది, అధికారుల బాధ్యత అని చెప్పారు. పనికి రాని పాత పర్నిచర్ ఉన్న పక్షంలో వాటిని తొలగించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జెసి ఎ. రవీంధర్‌రెడ్డి, నగరపాలక కమీషనర్ జెమ్స్‌సాంసన్, ఆర్డిఓ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News