Thursday, April 25, 2024

భారీ వర్షాలను పసికట్టలేకపోతున్నాం

- Advertisement -
- Advertisement -

Climate change is difficult to predict

వాతావరణం అంచనాలో పెనుసవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి
ఐఎండి అధినేత మృత్యుంజయ

న్యూఢిల్లీ : వాతావరణ మార్పులను అంచనావేయడం కష్టం అయిందని, ప్రపంచ వ్యాప్తంగా సంబంధిత సంస్థలకు ఇది సవాలు అయిందని భారత వాతావరణ పరిశోధక సంస్థ (ఐఎండి) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మెహాపాత్ర తెలిపారు. ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం, విడవకుండా ఒకేచోట మబ్బులు దట్టంగా అలుముకుని రోజుల తరబడి వర్షాలు కురియడం వంటి పరిణామాలు అంచనాలకు అందనివి అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు వాతావరణ సంస్థల అంచనాల పరిధికి అందని విధంగా వాతావరణంలో మార్పులు నెలకొంటున్నాయని భావించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఈసారి రుతుపవనాలు ఆగమనం, వర్షాలు కురిసే తేదీల విషయంలో ఐఎండి అంచనాలు విశ్లేషణలు దాదాపుగా సరయ్యాయి. అయితే భారీ వర్షాల విషయంలో ముందస్తు అంచనాలు కుదరలేదన్నారు. ఇది వాతావరణంలో అంతర్గతంగా నెలకొంటున్న మౌలికమైన మార్పుల ప్రక్రియ ఫలితం అన్నారు.

ఇప్పటి పరిణామంతో పలు దేశాల వాతావరణ కేంద్రాలు తమ పరిశీలనా వ్యవస్థలను మరితగా విస్తృతపర్చుకుని తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. 1901 నుంచి ఇప్పటివరకూ నమోదు అయిన వర్షాల డిజిటల్ డేటా తమ కేంద్రం వద్ద అందుబాటులో ఉంది. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం వంటి చోట్ల ఇంతకు ముందటితో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదు అయింది. అయితే పశ్చిమ ప్రాంతం అంటే రాజస్థాన్ పశ్చిమ ప్రాంతం ఇతర చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయని వివరించారు. ఇది తాము ఊహించలేదని, తమ సంస్థ పర్యవేక్షక వ్యవస్థ పరిధిలోకి రాలేదని వివరించారు. ఇప్పుడు దేశంలో వర్షాకాలంపై వాతావరణ మార్పులు ప్రభావం ఇక ముందు కూడా ఉంటుందా? ఇకపై పరిస్థితి ఏమిటనే అంశాలపై ఇప్పటికైతే స్పష్టత లేదన్నారు. అయితే ప్రతిసారి అంచనాలకు అటూ ఇటూగా వర్షపాతాలు ఉంటాయని, అయితే ఈసారి ఇందుకు భిన్నంగా కొన్ని ప్రాంతాలలో వర్షాలు అంచనాలకు అందలేదన్నారు. ఇప్పుడు మరో కీలక పరిణామం నెలకొంది. వర్షాలు తక్కువ అవుతున్న ప్రాంతాలలో క్రమేపీ అవి తక్కువ అవుతూ రావడం, ఇదే దశలో వర్షాలు పడే చోట ఇవి అత్యధిక స్థాయికి చేరుకోవడం జరుగుతోంది.

ఈ రెండు కూడా ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెడుతున్నాయి. అయితే వర్షాలపై అల్పపీడన వ్యవస్థల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సముద్రంలో నెలకొనే పరిస్థితుల ప్రాతిపదికనే వర్షాలు ఏ స్థాయిలో పడుతాయనేది ఖరారు అవుతోంది. వాతావరణ మార్పులతో ఉపరితల వాయు ఉష్ణోగ్రతలు పెరిగి, తరువాత జరిగే పరిణామాల నడుమ కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయని ఐఎండి అధినేత వివరించారు. అరేబియా సముద్రంలో తుపాన్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వాతావరణ మార్పులతో గాలిలో తేమ ఇతర విషయాలలో అస్థిరత్వం నెలకొనడం వర్షాలపై ప్రభావంచూపుతోంది. పడేచోటనే ఎక్కువగా వర్షాలు కురిసే పరిస్థితి ఏర్పడుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News