Saturday, April 20, 2024

వాతావరణ అంచనాలు వేయడం కష్టతరంగా మారింది

- Advertisement -
- Advertisement -

 

IMD Director General Mruthunjay Mohapatra

న్యూఢిల్లీ: వాతావరణ మార్పు వాతావరణం అంచనావేసే సామర్థాన్ని దెబ్బతీసింది. వాతావరణ సంస్థలు ముందస్తుగా, ఖచ్చితంగా అంచనా వేయడంలో వెనుకబడుతున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఖచ్చితమైన అంచనాలు వేసేందుకు వాతావరణ శాక మరిన్ని రాడార్లను ఏర్పాటుచేస్తోంది. అంతేకాక బాగా పనిచేసే కంప్యూటింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్‌చేస్తోందని ఆయన చెప్పారు. ‘మాన్సూన్ వానలు గణనీయమైన ట్రెండ్‌ను చూపకపోయినప్పటికీ, వానలు బాగానే పడ్డాయి. అలాగే వాతావరణ మార్పు కారణంగా కొన్ని చోట్ల వానలు తగ్గిపోయాయి’ అని ఆయన తెలిపారు. ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్‌కాస్ట్ 2025 నాటికి మెరుగుపడుతుందని, అప్పుడు మరింత గ్రాన్యలర్, స్పెసిఫిక్, ఖచ్చితమైన అంచనాలు అందుతాయని ఆయన వివరించారు. 1970 నుంచి వర్షపాతం డేటాను రోజువారిగా విశ్లేషిస్తున్నామని, అది భారీ వానలు పెరిగాయని, సాధారణ వానలు తగ్గాయని చూపుతోందన్నారు. ‘దీనర్థం ఏమిటంటే వానలు పడకపోతే అసలు పడవు, పడితే విపరీతంగా పడుతున్నాయి. అల్పపీడనం ఏర్పడినప్పుడు వానలు తీవ్రస్థాయిలో పడుతున్నాయి’ అన్నారు. వాతావరణ మార్పు ఉపరితల ఉష్ణోగ్రతను పెంచేసిందన్నారు. తద్వారా ఆవిరి రేటు పెరిగిపోయిందన్నారు. వేడి గాలి మరింత తేమను గ్రహిస్తుంది, కనుక దాని ఫలితంగా తీవ్ర వానలు పడుతుంటాయి’ అని ఆయన వివరించారు. వర్షపాతం  అంచనాలు -కోడెడ్ రంగు  ఫార్మాట్‌లో ఉంటాయి. ప్రమాద స్థాయిలు , సూచన చర్యలతో అనుబంధించబడి ఉంటాయి. అవి: ఆకుపచ్చ (చర్య అవసరం లేదు), పసుపు (గ్రహించండి , తాజా వివరణ తెలుసుకోండి), నారింజ (సిద్ధంగా ఉండండి) , ఎరుపు (చర్యలు తీసుకోండి) అని.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News