Saturday, March 25, 2023

పెండింగ్ కేసులను త్వరలో మూసేయండి

- Advertisement -

sp

*వికారాబాద్ జిల్లా ఎస్‌పి అన్నపూర్ణ

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా : పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్స్ (ఎన్‌బిడబ్లుస్)కు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరగా మూసి వేయాలని జిలా ఎస్‌పి అన్నపూర్ణ కోర్టు పోలీస్ కానిస్టేబుళ్లను ఆదేశించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు పోలీస్ కానిస్టేబుళ్లతో పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ (ఎన్‌బిడబ్లుస్)పై సమావేశం నిర్వహించారు. ప్రతి కోర్టు కానిస్టేబుల్ తమ తమ పోలీస్‌స్టేషన్లవారీగా పెండింగ్‌లో ఉన్న ఎన్‌బిడబ్లుస్ వివరాలు, తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ, 2012వ సంవత్సరం కంటే ముందు ఉన్నటువంటి ఎన్‌బిడబ్లుస్, పెండింగ్ కేసులపై అధిక ప్రాధాన్యత ఇచ్చి వాటిని వీలైనంత త్వరగా మూసి వేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రతి యొక్క కోర్టు కానిస్టేబుల్‌కు ట్యాబ్‌లను అందజేస్తామని, ప్రతి రోజు కోర్టులో జరిగేటటువంటి కార్యక్రమాలు ఇంటర్‌నెట్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు. కోర్టు కానిస్టేబుళ్ల కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోర్టు కేసులలో శిక్ష పడేవిధంగా అధికారులకు తమ వంతు సహాయం చేయాలని, నేరస్తులకు శిక్ష పడినటువంటి కేసులలో సహాయం చేసినటువంటి కోర్టు కానిస్టేబుల్‌కు రివార్డులను ఇస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్టు పోలీస్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News