Friday, March 29, 2024

ఈ ఏడాది డబుల్ డిజిట్ కు దగ్గర్లో వృద్ధి రేటు: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

Nirmala Sitharaman
బోస్టన్: ఈ ఏడాది భారత్ డబుల్ డిజిట్‌కు దగ్గరలో వృద్ధి సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. వచ్చే భారత్ వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 8.5 శాతం మధ్యన ఉండగలదని, అది మరో దశాబ్దం పాటు నిలకడగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. బోస్టన్‌లోని హార్వర్డ్ కెనడీ స్కూల్‌లో మంగళవారం ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
వృద్ధి రేటు విషయంలో తమ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా లెక్కలు తీయనప్పటికీ ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలు భారత వృద్ధి రేటుపై ఓ అంచనావేశాయని అన్నారు. ఇండియా ఓ పెద్ద మార్కెట్ అని, ఇక్కడి మధ్యతరగతి వారు వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బు కలిగి ఉన్నారని ఆమె తెలిపారు. చాలా మంది భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి వేరే ప్రాంతాల నుంచి ఆసక్తి చూపుతున్నారని కూడా ఆమె ఈ సందర్భంగ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News