Friday, December 2, 2022

ప్రజలకు చేరువగా పాలనా వ్యవస్థ

  • ఉద్యమ స్ఫూర్తితో పాలమూరు పథకాల పూర్తి
  • కందనూలును ప్రథమ స్థానంలో నిలుపుదాం
  • రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి
- Advertisement -

Jupally-Krishna-Raoనాగర్‌కర్నూల్: ప్రభుత్వ పథకాలు అర్హులకు సక్రమంగా అందించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వ యంత్రాంగం త్వరిత గతిన చర్యలు తీసుకునేందుకు కింది స్థాయి ప్రభుత్వ యంత్రాంగం ఇతర వ్యవస్థలు సరైన రీతిలో స్పందించేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతో ఉపకరిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్‌కర్నూల్ నూతన జిల్లా ఆవిర్భావం సందర్భంగా మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పి, కలెక్టర్లతో కలిసి మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ప్రజలు అధికారులను కలిసేందుకు జిల్లా కేంద్రాల చుట్టూ తిరగడానికి ఎంతో వ్యయ ప్రయాసలకు గురయ్యేవారని, అధికారులు సైతం మారుమూల గ్రామాలకు చేరుకునేందుకు ఒక రోజు పట్టేదని, ప్రస్తుతం ఆ దుస్థితి తప్పుతుందన్నారు. ప్రజాసంక్షేమమే లక్షంగా సిఎం కెసిఆర్ పని చేస్తుంటే అవగాహన లేని కొందరు విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయాలకు, పార్టీలకతీతంగా జిల్లాల ఏర్పాటు నూతన ఒరవడి సృష్టిస్తుందని, ఇదీ శుభపరిణామమని మంత్రి జూపల్లి అన్నారు. తెలంగాణ సాధించిన అదే ఉద్యమ స్ఫూర్తితో పాలమూరు, కెఎల్‌ఐ ప్రాజెక్టులు పూర్తి చేసుకుందామన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు కందనూలు(నాగర్ కర్నూల్) జిల్లా ఆదర్శంగా ఉండేలా పరిపాలన సాగిం చాలని జిల్లా అధికారులను మంత్రి కోరారు. కలెక్టర్ ఎం.శ్రీధర్‌రెడ్డి మా ట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే పేదరికాన్ని నిర్మూలించాలని, ఉద్యోగ వకాశాలతో పాటు మౌలిక వసతుల కల్పించగలిగితేనే అది సాధ్యమన్నారు. పెద్ద జిల్లాలో అది సాధ్యం కాదని 10 లక్షల జనాభా కలిగిన చిన్న జిల్లాల వల్ల అందులో ఉండే 70, 80 వేల కుటుంబాలకు జాగ్రత్తగా చూసు కునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సులభమవుతుందన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడమే గాక ఇతర రాష్ట్రాలకు మోడల్ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తానని, అందుకు అందరి సహకారం కావాలని కోరారు. నూతన ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, ప్రతి పౌరునిలో భద్రతా భావం పెంపొందిచడంతో పాటు పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించేలా ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. విలేఖరుల సమావేశంలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాల్‌రాజ్, వంశీ చందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్‌కర్నూల్ జడ్పిటిసి కొండా మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాను ప్రారంభించిన మంత్రి జూపల్లి
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా ఆవిర్భావోత్సవం ఘనంగా జరిగింది. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ ఎస్పి కార్యాయాలను ప్రారంభించారు. కలెక్టర్ శ్రీధర్, ఎస్పి కల్మేశ్వర్ సింగన్ వార్‌లను సాదరంగా వారివారి ఛాంబర్లలోని సీట్లలో కూర్చొబెట్టారు. రాష్ట్రంలోనే నాగర్‌కర్నూల్ జిల్లాను అగ్రస్ధానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి, జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇరువు జిల్లా అదికారులను కోరారు. తొలుత టెలిఫోన్ ఎక్సేంజ్ నుండి మంత్రి జూపల్లి, కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ కల్మేశ్వర్ సింగన్‌వార్, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాల్‌రాజ్, వంశీ చంద్ రెడ్డి తదితరులు ఎద్దుల బండిపై కలెక్టర్ భవన ప్రాంగణానికి చేరుకున్నారు. కోయ నృత్యం, కొలాటాలు, బతుకమ్మలు, బాణాసంచా పేలుళ్ల మధ్య అట్టహాసంగా వీరికి స్వాగతం పలికారు. కలెక్టర్ ఎస్పీలకు పుష్ప గుచ్చం ఇచ్చి వారి వారి స్ధానాల్లో కూర్చొబెట్టారు. అనంతరం నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన వివిధ జిల్లా కార్యాలయాలను, పాలెంలో ఏర్పాటు చేసిన జిల్లా వైద్యాధికారి, ఆర్టిసి ఆర్‌ఎమ్ కార్యాలయాలకు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Latest Articles