Home జిల్లాలు సిఎం హామీల అమలుకు  వేళాయనే

సిఎం హామీల అమలుకు  వేళాయనే

బాల్కొండ, రూరల్ లకు రూ.1,670 లక్షలు
మోతెకు ప్రత్యేక నిధులు రూ. 200 లక్షలు
ప్రత్యేక నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కెసిఆర్‌కే సాధ్యం: ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి

Untitled-1నిజామాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించినప్పుడు అక్కడి ప్రజలకు పలు వరాలు కురిపించారు. సిఎం వరాలు నెరవేర్చేందుకు సోమవారం ప్రభుత్వం జిల్లాకు పెద్ద మొత్తం లో నిధులు విడుదల చేసింది. బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవ ర్గాలకు రూ. 1670 లక్షలు విడుదల చేస్తూ జీవోనం. 446 జారీ చేసింది. వీటిలో బాల్కొండకు రూ. 15.20 కోట్లు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రూ. 1.50 కోట్లు విడుదల చేసింది. బాల్కొండకు కేటా యించినన నిధుల్లో.. మోతె గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 80 లక్షలు, వేల్పూర్ గ్రామ పంచా యతీ భవన నిర్మాణానికి రూ. 50 లక్షలు, వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ వద్ద కప్పలవాగుపై వంతెన నిర్మాణానికి రూ. 7.50 కోట్లు, పచ్చల నడుకుడ వద్ద పెద్దవాగుపై వంతెన నిర్మాణానికి రూ. 6.40 కోట్లు కేటాయించారు. రూరల్ నియోజకవర్గానికి విడుదల చేసిన నిధుల్లో డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో సీసీ రోడ్లకు రూ. 1 కోటి, ప్లాట్‌ఫాం, స్మశానవాటిక కోసం రూ. 50 లక్షలు కేటాయించారు.
మోతెపై ప్రత్యేక ప్రేమ: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మోతె గ్రామస్తులపై ఉన్న అపార ప్రేమ ను నిరూపించుకున్నారు. హరితహారం కార్యక్రమం సందర్భంగా జిల్లాను సందర్శించినప్పుడు మోతె గ్రామ స్థులకు కురిపించిన వరాలను నెరవేర్చేందుకు ప్రత్యే కంగా నిధులను మంజూరు చేశారు. బాల్కొండ నియోజ కవర్గానికి చెందిన ఈ గ్రామంలోని పలు అభివృద్ధి పను లు చేపట్టేందుకు రూ. 2.00 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి అనుబంధంగా డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో కమ్యూనిటీహాల్‌లో మందిరం నిర్మించేందుకు మరో రూ. 50 లక్షలు మం జూరు చేశారు. సంక్షేమం , అభివృద్ధి కోసం ప్రత్యేక అభి వృద్ధి నిధుల కింద ఈ నిధులు మంజూరు చేస్తూ ప్రభు త్వం సోమవారం జీవోనం. 438 ను జారీ చేసింది. విడు దల చేసిన నిధులను, నిర్మాణ పనులను తక్షణం చేపట్టాలని కలెక్టర్‌కు ప్రిన్సిపల్ కార్యదర్శి బి.పి. ఆచార్య జీవో స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల హర్షం: హరితహారం కార్యక్రమంలో భాగంగా తమ నియోజకవర్గాల్లో పర్యటించిన ముఖ్య మంత్రి కెసిఆర్ వరాల జల్లు కురిపించిన సందర్భంగా ప్రతీ హామీని నిలబెట్టుకోవటం హర్షనీయమని బాల్కొం డ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌లు పేర్కొన్నారు.
‘మన తెలంగాణ’ ప్రతినిధితో వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కేసీఆర్‌కే సాధ్యమని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రత్యేక నిధుల జీవో విడు దల చేయటంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ సహ కారంతో తమ నియోజకవర్గాలను మరింత అభివృద్ధిపథాన తీసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.