Sunday, May 19, 2024

అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టుకు హాజరైన జగన్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సిఎం జగన్ నేరుగా నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద భారీగా పోలీసులు మొహరించి పటిష్ట భద్రత చేపట్టారు. జగన్ తో పాటు ఎంపి విజయసాయిరెడ్డి, ఎంఎలఎ ధర్మాన ప్రసాదరావు కూడా కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో భాగంగా కొండా మురళి, సురేఖ కూడా కోర్టుకు చేరుకున్నారు. కాగా, సిఎం హోదాలో జగన్ సిబిఐ కోర్టుకు హాజరుకావడం ఇదే తొలిసారి. చివరగా గత ఏడాది మార్చి 1న జగన్ సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్‌‌పై 11 చార్జిషీట్లను సిబిఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. సిఎం అయ్యాక వ్యక్తిగత మినహాయింపు నుంచి వాయిదాలు కోరినా సిబిఐ కోర్టు అనుమతించకపోవడంతో జగన్ ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు.

CM Jagan appears at CBI court in Nampally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News