Wednesday, April 24, 2024

అన్ని రంగాల్లో అభివృద్ధే సిఎం కెసిఆర్ లక్ష్యం

- Advertisement -
- Advertisement -
CM KCR aims at development in all sectors
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

పెగడపల్లిః రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అన్ని హంగులతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం మండలంలోని ల్యాగలమర్రి, రాంభద్రునిపల్లి గ్రామాల్లోని పూర్తి అయిన సిసి రోడ్లను, బ్రిడ్జి పనులను మంత్రి, జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత 60 సంవత్సరాల పాలకుల ప్రభుత్వాల్లో చేయని అభివృద్ధిని ముఖ్యమంత్రి కెసిఆర్ కేవలం ఆరేళ్లలో 60 సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపించిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ఎన్నో లక్షల కోట్ల నిదులు మంజూరు చేస్తూ గ్రామాలను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. భూమినే నమ్ముకుని బ్రతుకుతున్న రైతన్నలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కాళేశ్వరం లింక్-2 ప్రాజెక్టు పనుల్లో రైతులు తమ భూములు కోల్పోవద్దనే ఉద్దేశ్యంతో టన్నెల్ పనులను చేపట్టి ఎంతో మంది రైతు కుటుంబాలు భూములు కోల్పోకుండా చేశారని వివరించారు.

అలాగే రైతులు ఆర్థికంగా ఎదిగేలా ఉండేందుకు రైతుల పంటల సాగుకు 24 గంటలు కరెంటు అందించడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. గాంధీజీ కన్న కలలను ముఖ్యమంత్రి కెసిఆర్ నిజం అయ్యేలా గ్రామాల్లో ప్రతి వీధుల్లో సిసి రోడ్డు, గ్రామానికి కావలసిన మౌళిక వసతులు కల్పించి, ఆయన కళలను నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిలా మార్చుతున్నారని అన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి నిధులను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి పరుచుకోవాలని కోరారు. ప్రతి పనిని జాప్యం లేకుండా పనులు చేపట్టి పనులను త్వరత్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని తెలిపారు. రూ.3 కోట్ల 30 లక్షలతో చేపట్టిన పనులను ప్రారంభించి, వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. రాంభదునిపల్లిలో రూ.ఒక కోటి 80 లక్షలతో నిర్మించనున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి, రూ.20 లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

రూ.40 లక్షలతో చేపట్టిన సిసి రోడ్లు, మురుగు కాలువలు, నూతనంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం పనులు రూ.12 లక్షలతో నిర్మించిన వైకుంఠదామం పనులు ప్రారంభించారు. ల్యాగలమర్రి గ్రామంలో రూ.7.8 లక్షలతో నిర్మించిన వంతెన, రూ.20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపిపి గోళి శోభసురేందర్ రెడ్డి, జడ్‌పిటిసి కాసుగంటి రాజేందర్ రావు, వైస్ ఎంపిపి గాజుల గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఉమెంతుల వనజభాస్కర్ రెడ్డి, కోరుకంటి రాజేశ్వర్ రావు, ముదం అంజమ్మ, రాచకొండ స్వప్న ఆనంద్, రవి నాయక్, ఇనుగండ్ల కరుణాకర్ రెడ్డి, బాబు స్వామి, ఇనుకొండ లక్ష్మిమోహన్ రెడ్డి, ఉప్పులంచ లక్ష్మణ్, కొండయ్య, రాకేష్, బాలుసాని నిహారికశ్రీనివాస్ గౌడ్, టిఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు లోక మల్లారెడ్డి, సుంకరి మమత రవి, ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న, తిర్మని నర్సింహారెడ్డి, మడిగెల తిరుపతి, అందె వెంకటేశం, కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News