Friday, December 2, 2022

జవాన్ మహేశ్ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం

- Advertisement -

CM KCR Announces 50 Lakhs To Jawan Mahesh Familyకుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం
రాష్ట్రప్రభుత్వంచేయూత

మహేశ్ మరణంపై ముఖ్యమంత్రి
కెసిఆర్ దిగ్భ్రాంతి

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ని జామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రా ణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కెసిఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ. 50లక్షల ఆర్ధిక సహాయం అందించనున్నట్లు సిఎం వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని సిఎం పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles