Home తాజా వార్తలు సమ్మెతో ప్రభుత్వాన్ని బెదిరించలేరు : కెసిఆర్

సమ్మెతో ప్రభుత్వాన్ని బెదిరించలేరు : కెసిఆర్

CM KCRహైదరాబాద్ : సమ్మెతో ప్రభుత్వాన్ని బెదిరించలేరని తెలంగాణ సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఆర్ టిసి కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మెను విరమించాలని కెసిఆర్ పలుమార్లు కోరినప్పటికీ, టిఎస్ ఆర్ టిసి కార్మిక సంఘాల నేతలు మాత్రం తమ పట్టువీడడం లేదు. దీంతో సమ్మెలో ఉన్న కార్మికులందరూ తమకు తామే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసుకున్నారని కెసిఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్ టిసి లో కొత్త కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన ఆర్ టిసి అధికారులను ఆదేశించారు. వీరి నియామకంపై రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ నివేదికను తయారు చేస్తున్నారు. ఆయన నివేదిక అందిన వెంటనే కొత్త కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. సమ్మె కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, కార్మిక సంఘాలు మొండిగా వ్యవహరించడంపై కెసిఆర్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆర్ టిసిలోకి కొత్తవారిని తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.
CM KCR Comments On TSRTC Strike