Home తాజా వార్తలు గొల్లపూడి మృతిపట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

గొల్లపూడి మృతిపట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

 

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు(80) మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గొల్లపూడి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను సిఎం కెసిఆర్ కొనియాడారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశనం చేసాయని కెసిఆర్ అన్నారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గొల్లపూడి మారుతీరావు చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన దాదాపు 250 చిత్రాల్లో నటించారు.

CM KCR condoles over Gollapudi Maruthi Raos death