Wednesday, April 24, 2024

నీరజ్ చోప్రాకి సిఎం కెసిఆర్ అభినందనలు

- Advertisement -
- Advertisement -

CM KCR congratulates Neeraj Chopra

 

మన తెలంగాణ/హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో మొట్టమొదటి సారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని సిఎం అభినందించారు. నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఇందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు. నీరజ్ చోప్రా విజయం భారతీయులందరికీ గర్వకారణమని సిఎం పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News