Tuesday, November 29, 2022

మాంద్యం పడగనీడ

- Advertisement -

CM KCR

వాస్తవిక దృష్టితోనే బడ్జెట్ క్రీడ.. సంక్షేమం, సాగు అభివృద్ధికి ప్రాధాన్యం, పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ప్రభావం దేశ వ్యాప్తంగా అ న్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రా ష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. గత మార్చిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టినందున 201920 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ ను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు సిఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సీనియర్ అధికారులతో కలిసి సోమవారం ప్రగతి భవన్‌లో బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ఇతర ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

“దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొని ఉంది. అన్ని రంగాలపై దీని ప్రభావం పడింది. ఆదాయాలు బాగా తగ్గిపోయాయి. అన్ని రాష్ట్రాల్లో ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయం -అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన జరగాలని సిఎం వ్యాఖ్యానించారు. వాస్తవ దృక్పథంతో బడ్జెట్ తయారు చేయాలన్నారు. ప్రజా సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులుండేలా చూడాలి” అని చెప్పారు. బడ్జెట్ రూపకల్పనపై మంగళవారం కూడా కసరత్తు జరుగనుంది. తుది రూపం వచ్చిన తర్వాత మంత్రివర్గ ఆమోదం తీసుకోవడం, అసెంబ్లీని సమావేశపరిచి, బడ్జెట్ ప్రతిపాదించడం తదితర ప్రక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

CM KCR directs officials to budget Prepare

Related Articles

- Advertisement -

Latest Articles