Home తాజా వార్తలు నాపై తప్పుడు ఆరోపణ

నాపై తప్పుడు ఆరోపణ

CM KCRఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదు, ఇసికి సిఎం వివరణ

మన తెలంగాణ/హైదరాబాద్: హిందువులను కించపర్చేలా తాను వ్యాఖ్యానించలేదని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకుని ఫిర్యాదు చేశారని సిఎం కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ఓట్ల కోసం తను అలా మాట్లాడానని తప్పుడు ఆరోపణ చేశారని, దానిని పూర్తిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శికి లేఖ ద్వారా వివరణ పంపారు.

తన ప్రసంగం మొత్తం ప్రత్యక్ష ప్రసారమైందని, మరుసటి రోజు పత్రికలలో కూడా వచ్చిందన్నారు. టిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఆ సభలో ప్రసంగించానని, ఎన్నికల కోడ్, ప్రజాప్రతినిధ్య చట్టాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని వివరించారు. తన ప్రసంగం పూర్తిగా వింటే దేశ రాజ్యాంగానికి ప్రాథమిక నిర్మాణమైన లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. తాను హిందువులను కించపర్చినట్లు వచ్చిన ఫిర్యాదు తప్పుడు ఆరోపణ అని, ఓట్ల కోసం అలా మాట్లాడలదేని సిఎం కెసిఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు.

CM KCR Explanation Letter to EC