Home తాజా వార్తలు గూడూరుకు రూ. కోటి

గూడూరుకు రూ. కోటి

Gudur

మన తెలంగాణ/ సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడూరు గ్రామానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం కోటి రూపాయలు మంజూరు చేశారు. సిఎం కెసిఆర్ సోమవారం తన స్వగ్రామమైన చింతమడకకు వెళ్లిన సందర్భంగా నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ తన ఎదుగుదలకు కారణమైన చింతమడకతో పాటుగా తాను చదువుకున్న ప్రాంతాలకు కూడా కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కెసిఆర్ తన చిన్న తనంలో సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలోగల గూడూరులోని తన అక్కయ్య ఇంట్లో ఉండి భట్టు పంతులు బడిలో చదువుకున్నానని జ్ఞాపకాల దొంతరలు విప్పి గూడూరు గ్రామ అభివృధ్ధికి కూడా కోటి రూపాయలు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. గూడూరు గ్రామ అవసరాలు గుర్తించి వాటితో అభివృధ్ధి పనులు చేసుకోవాలని ఆయన ప్రకటించారు. కెసిఆర్ ప్రకటనతో గూడూరు వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

Cm kcr given 1 Crore For Gudur Village Devlopment