Home నల్లగొండ ఇక పాల పొంగు

ఇక పాల పొంగు

 CM KCR government distributed Buffellows in Nalgonda

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పాడి రైతు మరింత ఆర్ధిక ప్రగతి సాధించేందుకు దోహదపడేవిదంగా  సిఎం కెసిఆర్ ప్రభు త్వం పాడిపశువుల పంపిణీ కార్యక్రమా నికి శ్రీకారం చుట్టా రు. పాడిరైతు మరింత ఆర్ధిక పరిపుష్టి సాధించేందుకు మేలురకం పాడి గేదెలు పంపిణీ చేయా లని సంకల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల తో పాటు ఇతరులకు  రాయితీపై గేదెలు అందించేందుకు అవసరమైన మార్గదర్శ కాలు ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి అందాయి. జూలై మా సాంతం వరకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సర్వం సన్నద్దమవుతున్నారు. ఈ పధకం పూర్తిగా బ్యాంకులతో సంబందం లేకుండా ప్రభుత్వమే నేరుగా రాయితీతో లబ్దిదారులకు అందివ్వనుంది.

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : సంక్షేమ పథ కాల్లో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ తెలంగాణ సర్కారు మరో ముందడుగు వేసింది. గొర్రెలతో యాదవులకు, చేపపిల్లలతో మత్సకారులకు, రైతుబంధుతో అన్న దా తకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో బృహ త్తర పథకంతో ముందుకొచ్చింది. జిల్లాలోని పాడి రైతా ంగానికి సబ్సిడీ పాడిగేదెల పంపిణీ కార్యక్రమంలో మ రో పది రోజుల్లో ప్రారంభంకానుంది. అందుకు అధి కారులు తగిన ప్రణాళికలు సిద్దం చేశారు. అం దులో భాగంగా పశు సంవర్ధక శాఖ ఆద్వర్యంలో గతంలో స బ్సిడీ గొర్రెలు పంపిణీ చేయగా తాజాగా సబ్సిడీ పాడిపశువులను లబ్దిదారులు ఎవరి ను ంచై నా, ఎ క్కడి నుంచైనా, ఏరకమైనవైనా స్వేచ్చగా కొను గోలు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఈ విష యంలో ప్రభుత్వ అధికారులు కాని, ఇ తర అన ధికా రులు కాని జోక్యం చేసుకోవడానికి వీలు లేదని, రైతు పశువును కొనుగోలుచేస్తే ఆ ప్రాంతం నుంచి రై తు వద్దకు చేర్చే రవాణా ఖర్చును జిల్లా కలెక్టర్ స్థా యి లో ఏర్పాటు చేయబడుతుంది. దాదాపు పాడి ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి గేదెలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చొరవచూపనుంది.
విజయ, నార్మాక్స్ సభ్యులకు అవకాశం : ఇప్పటికే పా లు సేకరిస్తున్న విజయాడెయిరీ, నల్లగొండ-రంగా రెడ్డి (నార్మాక్స్) సంఘాల్లో సభ్యులుగాఉన్నవారంద రికీ మొదటి విడతతో పాడి గేదెలు పంపిణీ చేయనున్నారు. ఈ రెండు సంస్థల ఆధీనంగా 8 పాలశీతలీకరణ కేంద్రాలు ఉండగా వాటి పరిధిలో విజయా డెయిరీ కింద 1, నార్మాక్స్ కింద 7 సొసైటీలు పాలు సేకరిస్తున్నాయి. ఈ 8కేంద్రాల పరిధిలో 418సొసైటీలు ఉండగా వాటిల్లో 14040 మంది సభ్యులున్నారు. సంఘాలలో సభ్యులుగా ఉన్న వారికి ఒక్కో పాడిరైతుకు ఒక్కో పాడిగేదెను రాయితీ రూపంలో రూ. 80వేలు వెచ్చించి ఇవ్వనున్నారు. కొనుగోలు చేసిన ప్రాంతం నుంచి రైతు వద్దకు గేదెను చేర్చేందుకు రవాణాతో పాటు నిర్వహణ ఖర్చుల కింద మరో రూ. 5వేలు జిల్లా కలెక్టర్, డెయిరీల స్థాయిలో సమన్వయంతో సమకూరుస్తారు.
ఎస్సీ, ఎస్టీలకు 75శాతం, ఇతరులకు 50శాతంః జిల్లాలోని 418 సొసైటీల్లో సభ్యులు ఉన్న ఎస్సీ, ఎస్టీలకు 75శాతం సబ్సిడీతో పాడి గేదెలను ఆగస్టు 1వ తేదీ నుంచి అందివ్వనున్నారు. ఆయా సొసైటీల పరిధిలో ఎస్సీ సభ్యులు 1865, ఎస్టీ సభ్యులు 372, ఇతర సభ్యులు 11,903 మంది ఉన్నారు. వీరిలో ఒక్కో ఎస్సీ, ఎస్టీల లబ్దిదారునికి ఒక్కో గేదె విలువను యూనిట్‌కాస్టుగా రూ. 80వేలకు నిర్ధారించిన ప్రభుత్వం అందులో 75శాతం వరకు రూ. 60వేలు సబ్సిడీ కాగా, మిగిలిన 25శాతం రూ. 20వేలు లబ్దిదారులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతరుల విషయానికొస్తే యూనిట్ కాస్టులో 50శాతం రూ. 40వేలు, లబ్దిదారుల వాటా కింద రూ. 40వేలు చెల్లించాలి. దీంతో లబ్దిదారులు ఏకరమైన పాడి పశువును ఏ ప్రాంతం నుంచి అయినా కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వ పూర్తి స్వేచ్చనిచ్చింది. ఇందుకు ఏమాత్రం కూడా బ్యాంకులతో సంబందం లేకుండా ప్రభుత్వమే విజయాడెయిరీ నుంచి నిధులు సమకూరుస్తూ రైతులకు నేరుగా సబ్సిడీ అందివ్వనుంది.
ఆగస్టు 1వ తేదీ నుంచి అమలుః సబ్సిడీ పాడి గేదెల పంపిణీ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో సదరు డెయిరీ సంస్థలు సమన్వయంతో ప్రభుత్వం మండల స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఎంపీడీఓ, తహశీల్దార్, డెయిరీ ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారి సభ్యులు ఉండి ఎంపిక, అమలు కార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహిస్తారు. గేదెల పంపిణీకి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో కాని, అమలులో కాని ఎలాంటి అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నా సంబందిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. యావత్ పథకం అమలుతీరును ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని కూడా తెలిపారు. ఇదిలా ఉండగా పాడిపశువుల కొనుగోలు చేసిన వెనువెంట నుంచి మూడు సంవత్సరాల వరకు నూటికినూరుశాతం భీమా సౌకర్యం కల్పిస్తారు. అదే విదంగా కొనుగోలు చేసిన తర్వాత 3నెలల వరకు ఉచితంగా 300కిలోల సమీకృత దాణాను అందిస్తారు. నిర్ధారించిన యూనిట్‌కాస్ట్ రూ. 80వేలలోనే పాడిపశువు ధర, 3సంవత్సరాల భీమా అదేవిదంగా 300కిలోల సమీకృత దాణా కలిసి ఉంటుందని, లబ్దిదారుడు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదని, దాణా కూడా సంబందిత డెయిరీ సంస్థ మూడు నెలలకు సరిపడా సరఫరా చేయాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు.
జిల్లాలో కార్యాచరణ షురూః పాడిగేదెల పంపిణీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపధ్యంలో పగడ్బందీ ప్రణాళికలతో జిల్లా యంత్రాంగం కార్యాచరణను ప్రారంభించింది. ఈనెల 20వ తేదీ నుంచి 26వరకు పాడిపశువుల పంపిణీపై లబ్దిదారులకు అవగాహన సదస్సులు నిర్వహించి సబ్సిడీపై గేదెలు మంజూరు దృవీకరణ పత్రాలు అందజేస్తారు. ఇందులో 23వ తేదీన భీమా ప్రీమియా రేట్లతో పాటు భీమా సంస్థల ఎంపిక చేసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చివరగా 26వ తేదీ పథకం నిర్వహణకు సంబందించి సిబ్బందిని ఎంపిక చేస్తారు. ఈ ప్రకారం జూలై మాసాంతం వరకు కార్యాచరణ మేరకు కార్యక్రమాలు ముగించి ఆగస్టు 1వ తేదీ నుంచి గేదెల కొనుగోలు కార్యక్రమాన్ని చేపడుతారు.