Thursday, April 25, 2024

కారాపి మొరవిని వరమిచ్చిన సిఎం

- Advertisement -
- Advertisement -

CM KCR

 

దారిలో కారాపి వికలాంగ వృద్ధుడు సలీంకు అక్కడికక్కడే పెన్షన్, డబుల్‌బెడ్‌రూం ఇల్లు, వైద్య ఖర్చులు మంజూరు చేసిన కెసిఆర్

హైదరాబాద్ టోలిచౌకిలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా సిఎం కంటపడిన వికలాంగ వృద్ధుడు సలీం

గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వృద్ధుడు, బిల్డింగ్ పైనుంచి పడగా
విరిగిన కాలు, తొమ్మిదేళ్లుగా పీడిస్తున్న అనారోగ్యం
ఆరోగ్యం క్షీణించిన కొడుకు, దీనగాథ విని చలించిపోయిన
కెసిఆర్, సిఎం ఉత్తర్వులతో హుటాహుటిన కదిలి పెన్షన్,
డబుల్‌బెడ్‌రూం ఇల్లు మంజూరు చేసిన కలెక్టర్ శ్వేతామహంతి
వైద్య చికిత్స, ఆర్థిక సాయం చేస్తామని హామీ

మన తెలంగాణ/హైదరాబాద్ : వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించాడు. కెసిఆర్ వెంటనే కారు దిగి ఆగారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనకు తానుగా పరిచయడం చేసుకున్న సలీం గతం లో డ్రైవర్ గా పనిచేసేవాడినని, తొమ్మిదేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నాని చెప్పుకున్నాడు. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడడంతో కాలు విరిగిందన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకు తనకు తోడుగా ఉంటాడని భావించినప్పటికీ, అతని ఆరో గ్యం కూడా క్షీణించిందని ఉండడడానికి ఇల్లు కూ డా లేదని, తగిన సహాయం చేయాలని కోరాడు.

దీని కి ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్ మం జూరు చేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూ రు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టోలీ చౌకిలో సలీమ్ నివాసముంటున్న ఇంటికి వెళ్లి కలెక్టర్ విచారణ జరిపారు. సలీమ్ వికలాంగుడని ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్ ఉండడంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీమ్ కు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేస్తామని హామీ ఇచ్చారు. కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతుండడంతో సిఎంఆర్‌ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.

 

CM KCR Help for the old man
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News