Saturday, April 20, 2024

పేద రైతులకు పెద్దన్న కెసిఆర్

- Advertisement -
- Advertisement -

రైతు నాయకులు దుండ్ర మల్లేష్ యాదవ్
ముఖ్యమంత్రి కెసిఆర్, ఎంఎల్‌ఎ గండ్రల చిత్రపటానికి రైతుల పాలాభిషేకం


మనతెలంగాణ/భూపాలపల్లి టౌన్‌: రైతుబంధు సాయంతో ప్రతి పేద రైతుకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కెసిఆర్ నిలిచారని రైతు నాయకులు దుండ్ర మల్లేష్ యాదవ్ అన్నారు. మంగళవారం భూపాలపల్లిలో ముఖ్యమంత్రి కెసిఆర్, ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డిల చిత్రపటానికి రైతులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు దుండ్ర మల్లేష్ యాదవ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో రైతు సుఖంగా ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి దేశంలో ఆలోచించే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. పేద రైతుల కోసం విత్తనాలు కొనుక్కోవడానికి, పిండి బస్తాలు కొనుక్కోవడానికి, పురుగుమందులకై రైతుబంధు నిధులు విడుదల చేసి రైతులకు అండగా నిలిచారన్నారు. రైతులు ఆర్థిక ఇబ్బంది పడకుండా, అప్పులపాలు కావద్దనే ఉద్దేశ్యంతో రైతుబంధు ఎంతోమందికి ఉపయోగపడుతుందన్నారు. రైతుల కోసం పరితపించే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. అదేవిధంగా భూపాలపల్లి ఎంఎల్‌ఎ గండ్ర వెంకటరమణారెడ్డి వానాకాలం మొదలవడంతోనే ప్రతి మండల కేంద్రాలలో వ్యవసాయ అధికారులతో, రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించి మార్కెట్‌లో రైతులకు సరిపడ యూరియా, అదేవిధంగా విత్తనాలు, పురుగు మందులకు సంబంధించిన సామాగ్రిని అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారన్నారు. అదేవిధంగా పోలీసులకు, అగ్రికల్చర్ అధికారులతో నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. రైతుల కోసం జిల్లాలో ఉన్న, నియోజకవర్గంలో ఉన్న సొసైటీల ద్వారా వ్యవసాయ అధికారుల ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా అదేవిధంగా ఇరిగేషన్ అధికారుల ద్వారా రైతులకు ఎల్లవేళలా సాగునీరు అందించడానికి కృషి చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి గండ్ర వెంకటరమణారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతులు మేకల పోషయ్య, నర్సింగ్ రామయ్య, గోపు అశోక్‌రెడ్డి, గోపు సుధాకర్‌రెడ్డి, మామిడి రాజయ్య, బండి శ్రీనివాస్, టిఆర్‌ఎస్ యూత్ నాయకులు దేవరమత్తు, జి ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News