Home అంతర్జాతీయ వార్తలు బీజింగ్‌లో సిఎం కెసిఆర్

బీజింగ్‌లో సిఎం కెసిఆర్

cm-kcr

భారత రాయబారి విందు అంతకుముందు షాంఘైలో
షుజోవన్ భారీ ఇండస్ట్రియల్ పార్క్ సందర్శన రాష్ట్రంలో
పెట్టుబడులకు అంజు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంసిద్ధత

మన తెలంగాణ/హైదరాబాద్: షాంఘైలోని షుజోవన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, అధికారులు, ప్రజాప్రతినిధుల బృం దం సందర్శించింది. చైనా పర్యటనలో భాగంగా నాలుగోరోజు ముఖ్యమంత్రి ప్రతినిధి బృందం షాంఘైలో షుజోవన్ పార్క్‌లో పర్యటించి సాయంత్రం బీజింగ్‌కు చేరుకుంది. పార్క్ ఏర్పాటు, అందుకు దారితీసిన పరిస్థితులను పార్క్ కమిటీ మెంబర్ యు ముఖ్యమంత్రి ప్రతినిధి బృందానికి వివరించారు. చైనా-సింగపూర్ ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో సుమారు 228 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చైనా-సింగపూర్ షుజోవన్ పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేశారని యు వివరించారు. సుమారు 7 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారని, చైనా-సింగపూర్ ప్రభుత్వాల ఆర్థిక సహ కారంతో దిగ్విజయంగా నడుస్తున్నదని తెలిపారు. 228 చదరపు కిలోమీటర్ల పరిధిలో 80 చదరపు కిలోమీటర్లలో చైనా-సింగపూర్ కోఆపరేటివ్ జోన్ విస్త రించి ఉందన్నారు. ఇరు దేశాలు సంస్కరణల అమలు, పెట్టుబడుల ఆహ్వానా నికి ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ఎంపిక చేసుకున్నారన్నారు. ఇది అంతర్జాతీ య సహకారంతో ఏర్పాటైన విజయవంతమైన నమూనాగా పేర్కొంటు న్నారని యు వివరించారు. ఇది చైనాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అభివృద్ధి ప్రాంతం. ఇందులో అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ జోన్ చైనా లో ఏరా-్పటు చేసిన అన్ని అంతర్జాతీయ జోన్లలో ముందు వరసలో ఉంది. 1980 ద్వితియార్థం నుంచి ఆధునిక పారిశ్రామిక విధానంపై చైనాలో వేగం పుంజుకుంది. చైనా నుంచి అనేక మంది ప్రతినిధులు సింగపూర్ దేశంలో పర్యటించి ఆధునిక నిర్వహణ పద్ధతులు నేర్చుకున్నారు. అదే సమయంలో సింగపూర్ దేశం ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇదే సందర్భంలో రెండు దేశాలు షుజోవన్ తూర్పు ప్రాంతం లో ఆధునిక పార్కు ఏర్పాటుకు చేతులు కలిపి నూతన పారిశ్రామిక విధానా నికి బీజం వేశాయని పార్క్ కమిటీ మెంబర్ యు పేర్కొన్నారు. 1994 సంవ త్సరం ఫిబ్రవరి 26న చైనా-సింగపూర్ షుజోవన్ పారిశ్రామిక పార్క్ ఏర్పా టు చేయాలని అప్పటి చైనా వైస్ ప్రీమియర్ లి లామ్‌కింగ్, సింగపూర్ సీని యర్ మినిష్టర్ లీ క్యూయు ఒప్పందు కుదుర్చుకున్నారు. పార్క్ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చైనా వైస్ ప్రీమియర్, సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిష్టర్ ప్రతి ఏడాది సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారని ఆయన వివరించారు. పార్కు నిర్వహణ, అభివృద్ధి బాగుందంటూ మంత్రులు జూపల్లి కృష్ణారావు, జి.జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణలో కూడా పార్కులు ఏర్పాటు చేసేందుకు సహకరించాల్సిందిగా కోరారు.
సాయంత్రం బీజింగ్ చేరుకున్న కెసిఆర్ బృందం
షుజోవన్ పార్క్‌ను సందర్శించిన సిఎం కెసిఆర్, ఆయన ప్రతినిధి బృందం శుక్రవారం సాయంత్రం బీజింగ్‌కు చేరుకుంది. చైనాలోని భారత రాయబారి అశోక్ కె.కాంత నివాసంలో ఆయన ఇచ్చిన విందులో సిఎంతో పాటు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చైనాలో తన పర్యటన అనుభ వాలను తెలియజేస్తూ విజిటర్స్ రిజిష్టర్‌లో సిఎం సంతకం చేశారు.
సీఎంతో అంజు కంపెనీ డైరెక్టర్ భేటీ
చైనాలో పేరొందిన అంజు ఇన్‌ప్రాస్ట్రక్షర్ డైరెక్టర్ యోగేష్ వాగ్ షాంఘైలో కెసిఆర్‌తో భేటీ అయ్యారు. పారిశ్రామిక ప్రగతి కోసం నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని, పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా సిఎం ఆయనను కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించాలని సిఎం కోరగా యోగేష్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ డులు పెట్టేందుకు ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు.