Home జయశంకర్ భూపాలపల్లి మేడిగడ్డ వద్ద జల సంకల్ప హోమం

మేడిగడ్డ వద్ద జల సంకల్ప హోమం

CM KCRజయశంకర్ భూపాలపల్లి  : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్ దంపతులు శుక్రవారం ఉదయం మేడిగడ్డ వద్ద నిర్వహించిన జల సంకల్ప హోమంలో పాల్గొన్నారు. శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప మహోత్సవ యాగం చేశారు. శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు కెసిఆర్, గవర్నర్ నరసింహన్, ఎపి సిఎం జగన్, మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు తదితరులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి గోదావరి తీరం సుందరంగా ముస్తాబైంది. మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద మహా ఘట్టానికి ఏర్పాట్లు  పూర్తయ్యాయి.

CM KCR Jala Homam At Medigadda