Thursday, April 25, 2024

మర్కూక్‌ పంప్‌హౌస్‌‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

- Advertisement -
- Advertisement -

CM-KCR

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కూక్‌ పంప్ హౌస్ ను సిఎం కెసిఆర్, చిన్నజీయర్ స్వామితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక మోటర్ ను స్విచ్చాన్ చేసి కొండపోచమ్మ రిజర్వాయర్ లోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోతను ప్రారంభించారు. కాసేపట్లో గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ డెలివరీ సిస్టర్న్ వద్దకు చేరుకుంటాయి. కొండపోచమ్మ జలాశయంలో గోదావరి జలాలకు సిఎం, చిన్నజీయర్ స్వామి హారతులు ఇచ్చారు. చండీ, సుదర్శన హోమాల కలశ జలాలను జలాశయంలో సిఎం పోశారు. ఈ కార్యక్రమంలో చినజీయర్‌ స్వామి, పలువురు తెలంగాణ మంత్రులు, ఎంఎల్ఎలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News