Home Default ముగిసిన సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన

ముగిసిన సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన

CM KCR Leaves Delhi To Hyderabadహైద‌రాబాద్ : తెలంగాణ సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ నెల 1న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కెసిఆర్ వారం రోజుల పాటు అక్కడ పర్యటించారు. సెప్టెంబర్ 2న ఢిల్లీలోని వసంత్ విహార్ లో తెలంగాణ భవన్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గ‌డ్క‌రీ, గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ తదితరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారికి కెసిఆర్ పలు వినతిపత్రాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలపై, కెసిఆర్ చేసిన ప్రతిపాదనలపై ప్రధాని మోడీ, మంత్రులు సానుకూలంగా స్పందించారు. యాదాద్రి ఆల‌య ప్రారంభోత్స‌వానికి రావాలని మోడీని కెసిఆర్ ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న కెసిఆర్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ బయల్దేరారు.