Home తాజా వార్తలు గజేంద్ర సింగ్ షకావత్ తో ముగిసిన కెసిఆర్ భేటీ

గజేంద్ర సింగ్ షకావత్ తో ముగిసిన కెసిఆర్ భేటీ

ఢిల్లీ: కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ తో ముఖ్యంత్రి కె.చంద్రశేఖర్ రావు భేటీ ముగిసింది.  ఈ సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మేల్యేలు సి. లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సాగు, తాగునీరు ప్రాజెక్టులు, తదితర అంశాల పై చర్చించారు. 40 నిమిషాలు ఇద్దరు మధ్య చర్చ జరిగింది. రాయలసీమ ఎత్తిపోతలతో పాలమూరు జిల్లాకు జరుగుతున్న నష్టంపై వివరించారు. తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల వివాదంపై కూడా చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులతో పాటు నీటి కేటాయించాలని కోరారు. కెఆర్ఎంబి, జిఆర్ఎంబి గెజిట్ అమలు తేదీ వాయిదా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.