Wednesday, April 24, 2024

ఉద్యోగ సంఘాలతో ముగిసిన సిఎం సమావేశం

- Advertisement -
- Advertisement -

CM KCR Meeting Ended With Job Unions

హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో సిఎం కెసిఆర్ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాల సమావేశానికి సిఎస్ సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో టిజివో, టిఎన్జీవో, సచివాలయ ఉద్యోగ సంఘాలతో సిఎం చర్చించారు. వేతనాలు పెంపు, ఉద్యోగుల సమస్యలపై సిఎం కెసిఆర్ చర్చించారని సిఎస్ చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల డైరీలను సిఎం ఆవిష్కరించారు. పిఆర్సీపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ తెలిపారు. ఎపిలోని తెలంగాణ ఉద్యోగులందరినీ త్వరలో రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వేతన సవరణ సంఘం ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. జనవరి మూడో వారంలో వేతన సవరణను ప్రభుత్వం ప్రకటించనుంది. త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సిఎం భేటీ కానున్నారు. జనవరిలోపు అన్నిశాఖల్లో పదోన్నతులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జనవరి 6,7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సిఎస్ కమిటీకి కెసిఆర్ చెప్పారు. వీఆర్వోలను త్వరగా రెవెన్యూశాఖలోనే సర్దుబాటు చేస్తామని వెల్లడించారు. వేతన సవరణతో పాటు వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

CM KCR Meeting Ended With Job Unions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News