Thursday, April 25, 2024

బీ అలర్ట్

- Advertisement -
- Advertisement -

భారీ వర్షాలు కురుస్తున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి

జిల్లా కేంద్రాల్లోనే అన్నిశాఖల అధికారులు
ప్రాణ, ఆస్తి నష్టంజరగకుండా చర్యలు
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించండి
నాలాల విషయంలో తగుజాగ్రత్తలు తీసుకోండి
అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశాలు, సిఎస్‌తో సమీక్ష

Telangana cabinet meeting will be held today

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అ తిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తం గా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిఎం సోమేష్ కుమార్‌కు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలను అప్రమత్తం చేయాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఉ మ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురుస్తాయ ని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చే సింది. ఈ విషయంపై సిఎం కెసిఆర్ ఆదివారం సిఎస్ సోమేష్ కుమార్‌తో సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అ న్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధిక వర్షాలతో వరదలు, లోతట్టు ప్రాం తాలలో నీరు నిలిచే అవకాశం ఉందన్నా రు. వర్షాల వలన వరదలు సంభవించడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమ యం అయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై సిఎస్ కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు. చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్, పడిపోవడం వలన సాధారణ కార్యకలపాలకు అంతరాయం ఏర్పడుతుంది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి పొంగి పోవడం వలన లోతట్టు ప్రాంతాలలో, చిన్న బ్రిడ్జిలు, కాజివేలలలో నీరు ప్రవహించే అవకాశం ఉందని సిఎస్ జిల్లా కలెక్టర్లను హెచ్చరించారు. అలాగే ట్రాఫిక్ అంతరాయలు, ప్రజలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం కూడా ఉంది జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండి, ఇంతకు ముందే జారీ చేసిన ఫ్లడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. నీట మునిగే ప్రాంతాలు ఉంటే అక్కడ నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి, హెల్ప్‌లైన్ నెంబర్ల ద్వారా ప్రజల
సమస్యలపై స్పందిస్తూ వారికి ఎప్పటికప్పుడు సహకరించాలని ఆదేశించారు. నీట మునిగే పంటలపై వ్యవసాయ శాఖ కూడా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. పంట చేలలో నీరు నిల్వకుండా చూసుకునేలా క్షేత్రస్థాయి అధికారులు రైతులకు తగిన సూచనలు చేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, మూగ జీవాలకు కూడా ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని, కరెంట్ తీగలు తెగిపోవడంతో పాటు, పోల్స్ పడిపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని సిబ్బంది ఈ విషయంలో నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. జిల్లాల్లో వర్షాల కారణంగా వస్తున్న ఇబ్బందులు, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో పాటు ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో నాలాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్న పిల్లలు, పెద్దలు అటువైపు వెళ్లకుండా చూడాలన్నారు. అటువంటి చోట్ల హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News