Home తాజా వార్తలు మిషన్ భగీరథ పనుల పురోగతిపై సిఎం సమీక్ష

మిషన్ భగీరథ పనుల పురోగతిపై సిఎం సమీక్ష

cm-kcr-image

హైదరాబాద్: మిషన్ భగీరథ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం సమీక్ష జరిపారు. శనివారం కలెక్టర్ల సమావేవంలో మిషన్ భగీరథపై చర్చకు కొనసాగింపుగా ఈ సమీక్ష నిర్వహిచారు. వెనకబడిన జిల్లాల్లోని మిషన్ భగీరథ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామని  కెసిఆర్ తెలిపారు. ప్రధాన గ్రిడ్ పనులు 95 శాతం పూర్తియినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. మొత్తం ప్రాజెక్టులో 75 శాతం పనులు పూర్తైనట్లు అధికారులు సిఎం వివరించారు. గ్రామల్లో అంతర్గత పైప్ లైన్ల నిర్మాణం, నల్లాల ఏర్పాటు పనులపై ఆయన ఆరా తీశారు. ప్రతి ఇంటికి తాగు నీరు అందివ్వకపోతే రానున్నా ఎన్నికల్లో ఓట్లు అడగబోమన్న సవాల్ కు కట్టుబడి ఉన్నామని కెసిఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలకు 4, 5 నెలల ముందే మిషన్ భగీరథ పనలు పూర్తి చేయాలని అధికారలకు మంతి సూచించారు. ప్లోరైడ్, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.