Saturday, April 20, 2024

గవర్నర్‌తో సిఎం భేటీ

- Advertisement -
- Advertisement -

CM KCR

 

హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఎం కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సిఎస్ సోమేశ్ కుమార్, హెల్త్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డిజిపి మహేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి సిఎం కెసిఆర్ అంతకుముందు ప్రగతిభవన్‌లో కరోనాపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. నిజాముద్దీన్ సదస్సులకు వెళ్లి వచ్చినవారి వివరాలపై ఆరా తీశారు. సిఎస్, డిజిపి, వైద్యశాఖ కార్యదర్శితో సిఎం కెసిఆర్ చర్చలు జరిపారు.

అనంతరం గవర్నర్ తమిళిసైతో బుధవారం సాయంత్రం సిఎం సమావేశమయి ప్రస్తుత పరిస్థితులపై గవర్నర్‌తో సిఎం చర్చించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల స్థితిగతులను, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు, పేదలకు రేషన్ బియ్యం పంపిణీ, నగదు పంపిణీ, ఇతర పరిస్థితులను గవర్నర్‌కు సిఎం వివరించారు. కరోనా అనుమానితుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు తదితర విషయాలపై గవర్నర్‌తో సిఎం కూలకుశంగా చర్చించారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌కు తెలంగాణ నుంచి 1,000 మందికి పైగా వెళ్లిన నేపథ్యంలో వారి గుర్తింపునకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ తమిళిసైతో కెసిఆర్ చర్చించినట్టుగా రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.

 

CM KCR meets Governor Tamilisai
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News