Home తాజా వార్తలు షీలాదీక్షిత్ మృతిపై సిఎం కెసిఆర్, కెటిఆర్‌ల సంతాపం

షీలాదీక్షిత్ మృతిపై సిఎం కెసిఆర్, కెటిఆర్‌ల సంతాపం

మనతెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలాదీక్షిత్ మృతిపై ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రముఖులు ట్విట్టర్‌తో పాటు పలు ప్రకటనల్లో షీలాదీక్షిత్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌లు శనివారం షీలాదీక్షిత్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు వారు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె గుర్తించుకోదగిన నాయకులరాలని, 15 సంవత్సరాలు విజయవంతంగా సిఎంగా పనిచేశారని షీలాదీక్షిత్ సేవలను కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కొనియాడారు.

CM KCR deeply Saddened by Dikshits demise