Home తాజా వార్తలు త్వరలో కెసిఆర్ పాలమూరు పర్యటన

త్వరలో కెసిఆర్ పాలమూరు పర్యటన

Cm-Kcr

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల వేగవంతానికి ప్రత్యేక కృషి

మన తెలంగాణ/హైదరాబాద్ :ఒకవైపు కొత్తప్రాజెక్టులు, మరోవైపు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇ స్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మహబూబ్‌నగర్‌ను కరువునుంచి పూర్తిగా తరిమివేసి జిల్లావ్యాప్తంగా జలవనరులతో సస్యశ్యామ లం చేసేందుకు ప్రణాళికలను సిద్ధ ం చేశారు. త్వరలో పాలమూరు జి ల్లాలో రెండురోజులపాటు పర్యటిం చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత ల బహుళార్థక సాధక ప్రాజెక్టు పనులవేగం పెంచి వచ్చే వర్షకాలంనాటికి పూర్తి చేయాలనే దృఢసంకల్పం తో సిఎం కెసిఆర్ ఉన్నారు. ఈమేర కు జలవనరుల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమై పాలమూ రు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్లను పరిశీలిస్తూ ఖరారు చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మ హబూబ్‌నగర్ జిల్లామంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన తేదీలను ఖరారుచేసి సిఎ ం కెసిఆర్ ఆనుమతి తీసుకోనున్నా రు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జిల్లామంత్రులతో పాటు, నీ టి పారుదల శాఖ అధికారులతో సమావేశమై పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల పథకంలో భా గంగా నిర్మించనున్న రిజర్వాయర్ల స్థలాలను పరిశీలించారు.
ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న సిఎం కెసిఆర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిలాల్లో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర అబ్కారి,క్రీడా,పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ అదికారులతో సమావేశమై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథంకంలోని పనులపురోగతి, డిజన్ల పై సమీక్షలు చేస్తున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. కాళేశ్వరం తరహాలో మహబూబ్‌నగర్‌లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలనే దృఢసంకల్పంతో సిఎం కెసిఆర్ ఉన్నారని ఆయన చెప్పారు. కృష్ణానదీవరదజలాలు సముద్రంలో కలువనీయకుండా భారీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలోనే సిఎం కెసిఆర్ శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. అలాగే కరివెనలో పైలాన్‌ను ఆవిష్కరించారని చెప్పారు. ఆనాటి నుంచి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అయితే సిఎం కెసిఆర్ మరోసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించి అమసరమైతే రిజర్వాయర్లను పెంచేఆలోచనలోఉన్నారని తెలిపారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అధికారులు వి.రమేష్, సిఈలు మనోహర్,ఎస్‌ఈ దయానంద్ తదితరులతో మంత్రి శ్రీనివాస్ రెడ్డి సమావేశమై ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటనలోగా ఈ ప్రాజెక్టులో భాగంగా మహబూబ్‌నగర్ మిగులు ఆయకట్టు ప్రాంతాలకు నీరందించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తోంది : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
సిఎం కెసిఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను కూడా పరిశీలించే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లోని వనపర్తి, నాగర్ కర్నూల్, మమబూబ్‌నగర్, గద్వాల జిల్లాకలెక్టర్లతో మంత్రి సింగిరెడ్డి సమావేశమై సిఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. ఎదుల రిజర్వాయర్ పనులను సిఎం పరిశీలించే అవకాశాలున్నాయని మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా బడ్జెట్ సమావేశాలలోపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను సిఎం కెసిఆర్ పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులను కేటాయించనున్నట్లు అధికారులు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నదీ పై నిర్మించి ప్రతినీటి చుక్కను వినియోగించుకునే విధంగా రిజర్వాయర్లను నిర్మించిన సిఎం కెసిఆర్ ఆదే తరహాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించి మరోసారి చరిత్ర సృష్టించనున్నారని అధికారులు చెప్పారు.

Cm KCR Palamuru tour soon