Home తాజా వార్తలు ఆయుధ పూజలు చేసిన సిఎం కెసిఆర్

ఆయుధ పూజలు చేసిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రజలు విజయదశమి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆయుధ పూజలు చేశారు. ఆయుధ పూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. అనంతరం నల్లపోచమ్మ ఆలయంలో సిఎం కెసిఆర్‌ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. ఉద్యోగులు, కుటుంబసభ్యులకు సిఎం దసరా శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR performs Ayudha Pooja