Saturday, April 20, 2024

షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు

- Advertisement -
- Advertisement -

KCR

 

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఎవరికీ సీరియస్ లేదు అందరూ కోలుకుంటున్నారన్నారు. ఒకరు కోలుకున్నారు కాబట్టి 35 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మనకు కరోనా ప్రభావం అంతగాలేదు అయినా సీరియస్ గా తీసుకుంటున్నం అని చెప్పారు. కరోనా సోకని దేశం లేదని రిపోర్టులు వచ్చాయి. పరిస్థితి చేయిదాటితే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు సహకరించకుంటే ఆర్మీని దించాల్సి వస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. నిర్మల్ లో క్వారంటైన్ నుంచి ఒక వ్యక్తి 3 సార్లు తప్పించుకున్నాడు. మన దగ్గర కరోనా అనుమానితుల సంఖ్య 114 అని తెలిపారు. ఇది ఒక ప్రత్యేక పరిస్థితి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు వందశాతం సహకరించాలి. అమెరికా లాంటి దేశంలో కూడా ఆర్మీని రంగంలోకి దించారు. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పరిస్థితి మనం తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. కరోనా మీద అవగాహన తెచ్చే క్రమంలో పాజిటివ్ డైరెక్షన్ లో ముందుకు పోవాలని, ఏ ఊరి సర్పంచ్ ఆ ఊరి కథానాయకుడు కావాలిని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రజలను నియంత్రణ చేయడంలో ప్రజా ప్రతినిధులకు బాధ్యత లేదా..?, జిహెచ్ఎంసిలో కార్పోరేటర్లంతా ఎక్కడికి వెళ్లారు..? అని  సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. ఎంపిటిసిలు, జెడ్ పిటిసిలు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో నాయకులు కూడా అలా పనిచేయాలని సిఎం కెసిఆర్ సూచించారు.

CM KCR press meet on corona virus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News